Andhra Pradesh: నీటి పారుదల రంగ సమర్థ నిర్వహణకు లస్కర్ల వ్యవస్థ చాలా కీలకమని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) అన్నారు. మండలిలో మంగళవారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ విషయం చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చే నాటికి రాష్ట్రవ్యాప్తంగా 7224 మంది లస్కర్లకు గాను 1517 మంది మాత్రమే పని చేస్తున్నారని తెలిపారు. లస్కర్ల పదవీ విరమణ అనంతరం ఆ పోస్టులు ఎప్పటి కూ్పుడు భర్తీ చేయక పోవడం వల్ల నాళీలు ఏర్పడ్డాయన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ వేంటనే లస్కర్ల వ్యవస్థ ప్రాధాన్యాన్ని గురించి తక్షణ చర్యలు తీసుకున్నామన్నారు.
Read Also: Tirupati Crime: ప్రియుడు మోజులో కన్నకూతుర్నే హతమార్చిన కసాయి తల్లి

జీతాల పెంపు, బడ్జెట్ కేటాయింపులు
2025-26ఏడాదికి ఆఖరి ఎకరం వరకు నీరు అందించాలనే లక్ష్యంతో 1033మంది లస్కర్లను ఔట్సోర్సింగ్లో తీసుకున్నామని చెప్పారు. గత ప్రభుత్వం లస్కర్ల భర్తీ మాట అటుంచి, వాళ్ళ జీతాలు బకాయిలు కూడా చెల్లించలేదన్నారు. ఆ బకాయిలు రూ.9.16 కోట్లను కూటమి ప్రభుత్వం చెల్లించిందని గుర్తుచేశారు. లస్కర్ల రోజువారి జీతం రూ.350నుంచి రూ.550లకు నేడు కూటమి ప్రభుత్వం పెంచిన విషయం సభా దృష్టికి తీసుకొచ్చారు. గతంలో నీటి తీరువా పన్ను వసూలు చేస్తేనే లస్కర్ల జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండేదన్నారు. కానీ నేడు బడ్జెట్లో లస్కర్ల జీతాల కొరకు నిధులు కేటాయించామన్నారు.
నిధుల మంజూరు చేశామని స్పష్టం
ఈ వ్యవస్థను చక్కదిద్దడంతో పాటు లాకులు షట్టర్లు, మరమ్మత్తులు కూడా చేయడం వల్ల ఫలితాలు బాగుంటాయని చైర్మన్ స్థానం లో ఉన్న మోషేన్ రాజు సూచించగా, ఆ సూచనను కూడా పాటిస్తామన్నారు. గత వైసిపి ప్రభుత్వం ఐదేళ్ళలో ఓ అండ్ ఎం పనుల నిమిత్తం రూ.200 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. అందువలనే ఎక్కడి కక్కడ షట్టర్లు లాకులు తుప్పు పట్టిపో యాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఓఓ అండ్ ఎం పనుల కోసం రూ.780 కోట్లు మంజూరు చేశామని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: