हिन्दी | Epaper

Andhra Pradesh: ఈవీ ట్రాన్స్‌ వైస్‌ప్రెసిడెంట్‌గా వీవీ లక్ష్మీనారాయణ 

Aanusha
Andhra Pradesh: ఈవీ ట్రాన్స్‌ వైస్‌ప్రెసిడెంట్‌గా వీవీ లక్ష్మీనారాయణ 

మాజీ ఐపీఎస్ అధికారి V. V. Lakshminarayana (జేడీ లక్ష్మీనారాయణ) తాజాగా కార్పొరేట్ రంగంలో కీలక బాధ్యతలు స్వీకరించారు. ఈవీట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఆపరేషన్స్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన చేరారు. ఈ సంస్థ ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ Megha Engineering and Infrastructures Limited కు అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. జేడీ లక్ష్మీనారాయణ వంటి అనుభవజ్ఞుడైన అధికారి కార్పొరేట్ రంగంలోకి రావడం వ్యాపార, పరిపాలన వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Read Also: Andhra Pradesh: శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తికి పోటెత్తిన భక్తులు

Andhra Pradesh: VV Lakshminarayana appointed as Vice President of EV Trans
Andhra Pradesh: VV Lakshminarayana appointed as Vice President of EV Trans

అనేక హైప్రొఫైల్ కేసులను దర్యాప్తు చేసారు

లక్ష్మీనారాయణను ఈవీట్రాన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా తీసుకోవడానికి కారణం ఉంది.జేడీ లక్ష్మీనారాయణ ఎన్ఐటీ వరంగల్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చదివారు. అనంతరం ఐఐటీ మద్రాస్ నుంచి ఎంటెక్ పూర్తి చేశారు. తర్వాత అశోక్ లేల్యాండ్ ఆర్ అండ్ డీ విభాగంలో కెరీర్ మొదలుపెట్టారు. ఆ సమయంలో కమర్షియల్ వెహికల్ సిస్టమ్, మాన్యుఫ్యాక్చరింగ్ ఎన్విరాన్మెంట్స్ మీద ఆయన అనుభవం సంపాదించారు.

ఈవీట్రాన్స్ సంస్థ ఎలక్ట్రిక్ బస్సుల తయారీని వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో లక్ష్మీనారాయణ అనుభవం, కార్య దక్షత తమకు ఉపకరిస్తాయని ఆ సంస్థ భావిస్తోంది. లక్ష్మీనారాయణ నియామకం విషయాన్ని ఈవీట్రాన్స్ సంస్థ లింక్డ్ఇన్ ద్వారా స్వయంగా వెల్లడించింది. 2006-13 మధ్య డిప్యూటేషన్ మీద సీబీఐకి వెళ్లిన లక్ష్మీనారాయణ.. జాయింట్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారని.. ఈ సమయంలో ఆయన అనేక హైప్రొఫైల్ కేసులను దర్యాప్తు చేశారని కూడా ఈవీట్రాన్స్ గుర్తు చేసింది.మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన వీవీ లక్ష్మీనారాయణ .. ముంబైలో అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ జనరల్‌గా పదవీ విరమణ పొందారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన ఆయన జనసేన తరఫున (Andhra Pradesh) విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2023లో జై భారత్ నేషనల్ పార్టీ పేరిట సొంత పార్టీ పెట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870