हिन्दी | Epaper

Andhra Pradesh: కన్నుల పండుగగా శ్రీశైల మల్లన్న రథోత్సవం

Rajitha
Andhra Pradesh: కన్నుల పండుగగా శ్రీశైల మల్లన్న రథోత్సవం

భక్తజన సందోహం నడుమ మల్లన్న తెప్పోత్సవం

శ్రీశైలం : మహాశివరాత్రి పురస్కరించుకొని నవాహిక దీక్షతో 11 రోజులపాటు నిర్వహింపబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 9వ రోజైన సోమవారం నాడు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. తరువాత యాగశాల యందు శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపించబడ్డాయి. అనంతరం లోక కళ్యాణం కోసం జపాలు, పారాయణులు, చేశారు. అనంతరం మండపారాధనలు, పంచావరనార్చనలు, శివ పంచాక్షరి, నిత్య హోమాలు, రుద్రహోమం, చండీ హోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారం జరిపారు. అదే విధంగా సాయంకాలం ప్రదోషకాల పూజలు, జపాను స్థానాలు, రుద్ర పారాయణులు, హోమాలు చేశారు. మహాశివరాత్రి పర్వదినం మరుసటి రోజున సాయంకాలం స్వామి. అమ్మవార్ల రథోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. రథోత్సవంలో సాంప్రదాయాన్ని అనుసరించి ముందుగా రథాంగపూజ, రథాంగ హోమం, రథంగా బలి, కార్యక్రమాలు నిర్వహించారు.

Read also: Bill Gates: మంత్రులను పరిచయం చేసిన సీఎం

Srisailam Mallanna Chariot Festival a feast for the eyes

Srisailam Mallanna Chariot Festival a feast for the eyes

రధాంగ బలిలో వసంతముతో నింపిన గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, కుంభం (అన్నం రాసి) సాత్విక బలిగా సమర్పించారు. తరువాత శ్రీ స్వామి అమ్మవార్లను రథంపైకి వేంచేపు వేయించి రధోత్సవం జరిపించారు. రథోత్సవాన్ని పురస్కరించుకొని బంతి, చామంతి, గులాబీలు, కాగడాలు, కనకాంబరాలు, చాందిని, తదితర 11 రకాల వుష్పాలతో రథాన్ని అలంకరించడం జరిగింది. ఈ రథోత్సవ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ శరన్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు పి. రమేష్ నాయుడు, శ్రీశైల దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాసరావు, మండలి సభ్యులు, అధికారులు, అర్చక స్వాములు, భక్తులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తజన సందోహం నడుము మల్లన్న తెప్పోత్సవం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రాత్రి 8 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించారు.

మల్లన్న తెప్పోత్సవం – పుష్కరిణిలో దివ్య దృశ్యం

ఆలయ పుష్కరిని వద్ద ఈ తెపోత్సవ కార్యక్రమం జరిపారు. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను పోడ శోవచారపజల నిర్వహించబడ్డాయి. తరువాత ఉత్సవమూర్తులను ఆలయ రాజగోపురము నుండి పుష్పాలంకృత పల్లకిలో ఊరేగింపుగా తోడుకొని వచ్చి పుష్కరిణిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తెప్పపై వేంచేబు చేయించి విశేష పూజాదికాలు నిర్వహించారు. తరువాత మంగళ వాయిద్యాల నడుమ వేదమంత్రాలతో ఎంతో శాస్త్రకంగా ఈ తెప్పోత్సవం జరిగింది. కాగా వివిధ రకాల పుష్పాలతో చేసిన ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపాలంకరణతో ఈ తెప్ప ఎంతో కళాత్మకంగా రూపొందించబడింది. తెప్పోత్సవాన్ని దర్శించుకోవడం వలన శ్రేయస్సు కలుగుతుంది, శత్రు బాధలు తొలగిపోతాయి, కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:33

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

విజయవాడ దుర్గమ్మ సన్నిధికి సీఎం చంద్రబాబు

విజయవాడ దుర్గమ్మ సన్నిధికి సీఎం చంద్రబాబు

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీరామ బ్రహ్మోత్సవాలు

అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీరామ బ్రహ్మోత్సవాలు

గువాహతిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్

గువాహతిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్

టీటీడీ ఛైర్మన్ ను తక్షణమే తొలగించాలంటూ నారాయణ డిమాండ్

టీటీడీ ఛైర్మన్ ను తక్షణమే తొలగించాలంటూ నారాయణ డిమాండ్

ఈ నెల వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

ఈ నెల వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

జై ఆంధ్రాతో కవిత కొత్త స్వరం

జై ఆంధ్రాతో కవిత కొత్త స్వరం

📢 For Advertisement Booking: 98481 12870