हिन्दी | Epaper

Andhra Pradesh: ఉపాధి హామీ పరిరక్షణకు షర్మిల యాత్ర

Rajitha
Andhra Pradesh: ఉపాధి హామీ పరిరక్షణకు షర్మిల యాత్ర

ఆళ్లగడ్డ : నంద్యాల జిల్లాలో కొనసాగుతున్న ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఏపీసీసీ (ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి కానాలపల్లి గ్రామంలో రచ్చబండ నిర్వహించారు. గ్రామస్థులతో ప్రత్యక్షంగా మాట్లాడిన ఆమె, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కలిసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని బలహీనపరుస్తున్నాయని ఆరోపించారు. ఉపాధి హామీ ఉద్యోగ కార్డుల తొలగింపు గ్రామాల్లో ఉపాధి సంక్షోభం రాష్ట్రంలో గతంలో 1.10 కోట్ల ఉపాధి హామీ ఉద్యోగ కార్డులు ఉండేవని, దాదాపు రెండున్నర కోట్ల మంది ఉపాధి ద్వారా లబ్ది పొందారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఉపాధి పనులు గ్రామాల్లో పండుగలా జరిగేవని, పనిస్థలాల్లో అన్ని వసతులు కల్పించేవారని తెలిపారు.

Read also: Automatic Weather Station Nellore: కొరుటూరులో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌ను పరిశీలించిన కలెక్టర్

Sharmila's Yatra to protect employment guarantee

Sharmila’s Yatra to protect employment guarantee

అయితే గత ఏడాది కాలంలో 18.5 లక్షల ఉద్యోగ కార్డులు తొలగించారని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టం సారాన్ని తీసేశారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరుస్తూ కొత్త గ్రామీణాభివృద్ధి చట్టం పేరుతో మార్పులు తెచ్చారని విమర్శించారు. పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించారని ఆరోపించారు. కాంగ్రెస్ చేస్తున్న పోరాటం ఉపాధి హామీ పరిరక్షణ కోసం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ జరిగే వరకు ఈ పోరాటం ఆగదు” అని షర్మిల స్పష్టం చేశారు. వైయస్ షర్మిల నిర్వహించిన యాత్రలో కర్నూలు జిల్లా ఇంచార్జీ జంగిటి లక్ష్మీనరసింహాయాదవ్ ఆళ్లగడ్డ తాలూక కాంగ్రెస్ పార్టీ కమిటీ నాయకులు బరగొడ్ల వుశేన్ బాష, నంద్యాల జిల్లా సెల్ ఉపాధ్యక్షులు మౌలానా అబ్దుల్ అజీద్, మైనార్టీ సెల్ కార్యదర్శి ఎస్ఎంకే పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870