అనారోగ్య కారణాలతో విధుల నుంచి తప్పుకోవాల్సి వచ్చిన ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(Andhra Pradesh) ఊరట కల్పించింది. వారి భవిష్యత్ భద్రతకు సంబంధించి పరిహారం, ప్రత్యామ్నాయ ఉద్యోగాల అంశాల్లో కీలక ఆదేశాలు జారీ చేసింది. రవాణా శాఖ జారీ చేసిన జీవో నంబర్ 58ను ప్రాతిపదికగా తీసుకున్న కోర్టు, అర్హులైన ఉద్యోగులు తమకు అల్టర్నేట్ ఉద్యోగం కావాలా లేదా ఆర్థిక పరిహారం కావాలా అనే అంశాన్ని స్పష్టంగా తెలియజేయాలని సూచించింది. ఇందుకోసం ఉద్యోగులకు 8 వారాల గడువు ఇచ్చింది.
Read also: AP: వచ్చేనెల ఆర్సెలర్ మిట్టల్స్టీల్ ప్లాంట్ కు శ్రీకారం

గడువుల్లో పరిష్కారం చూపాలని స్పష్టమైన టైమ్‌లైన్
కోర్టు ఆదేశాల ప్రకారం,
- అదనపు పరిహారం కోరిన ఉద్యోగుల విషయంలో మూడు నెలల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలి
- ప్రత్యామ్నాయ ఉద్యోగం కోరినవారికి, అందుబాటులో ఉన్న ఖాళీలను బట్టి గరిష్టంగా ఆరు నెలల్లోగా నియామకం లేదా పరిష్కారం ఇవ్వాలి
అని రవాణా శాఖను హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది.
ఉద్యోగుల కుటుంబాలకు ఊరట
ఈ తీర్పుతో అనారోగ్యంతో ఉద్యోగం కోల్పోయిన ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే కాకుండా, వారి కుటుంబాలకు కూడా భరోసా లభించినట్లు భావిస్తున్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై కోర్టు(Andhra Pradesh) స్పష్టమైన దిశానిర్దేశం చేయడం కీలకంగా మారింది. కోర్టు ఆదేశాల అమలు విషయంలో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖను హెచ్చరించింది. ఉద్యోగుల ఎంపికల ఆధారంగా నిర్ణీత గడువుల్లో చర్యలు తీసుకోకపోతే, చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసినట్లు సమాచారం
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: