ప్రభుత్వం టెండర్ ఉత్తర్వులు జారీ
రాజంపేట : రాష్ట్రంలో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు రైతులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ముందడుగు వేసింది. పూర్తి సెక్యూరిటీ ఫీచర్లతో, దొంగ పాస్ పుస్తకాలు రాకుండా ప్రతి రైతుకు సంబంధించిన పూర్తి వివరాలతో పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేస్తామని ఇప్పటికే సిఎం చంద్రబాబు పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 69.83 లక్షల మంది రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేసేందుకు ఆదివారం రెవెన్యూ శాఖ టెండర్ ఉత్తర్వులు జారీ చేసింది. సిసిఎల్ఎ రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ జె.వెంకట మురళి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
Read also: TDP MP Drugs Issue: నేను తప్పు చేయలేదు.. వీడియో విడుదల చేసిన ఎంపీ

Andhra Pradesh: New Pattadar Passbooks for 69 Lakh Farmers
రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాలకు సరఫరా
టెండర్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం అవుతుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. వైసిపి హయంలో అప్పటి సిఎం జగన్మోహన్ రెడ్డి ఫొటోలతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. దీన్ని టిడిపి పూర్తిగా వ్యతిరేకించింది. ఒకరి ఆస్తుల పై సిఎం ఫొటోలు ఏమిటని విమర్శించింది. దీనికి తోడు దొంగ పాస్ పుస్తకాల ముద్రణ, అసమగ్ర సమాచారం ఉండడంతో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి సర్కార్ పూర్తి వివరాలతో కొత్త పాస్ పుస్తకాలు అందించేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రములోని 28 జిల్లా కేంద్రాలకు కొత్త పాస్ పుస్తకాలను సరఫరా చేసేలా టెండర్లను పిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: