हिन्दी | Epaper

Andhra Pradesh: అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని జగన్ కీలక నిర్ణయం

Rajitha
Andhra Pradesh: అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని జగన్ కీలక నిర్ణయం

నేడు సమావేశాలకు జగన్ తో సహా వైసిపి సభ్యులంతా హాజరు

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హజరు కావాలని మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారంనుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగంతో సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశాలకు వైసీపీ హాజరు పైన కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. తాజాగా పార్టీ నేతలతో భేటీ సమయంలో జగన్ సభకు హాజరు పైన స్పష్టత ఇచ్చారు. జగన్ (jagan mohan reddy) తో పాటుగా ఎమ్మెల్యేలు సభకు హాజరు కానున్నారు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కాగా.. వైసీపీ ఇదే సమయంలో మరో ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సమావేశాలను ప్రారంభించనున్నారు.

Read also: CM Chandrababu: పోలవరానికి అదనంగా రూ.32 వేల కోట్లు కావాలి

Jagan's key decision to attend assembly meetings

Jagan’s key decision to attend assembly meetings

తరువాత బీఏసీ సమావేశంలో సభ నిర్వహణ.. అజెండా.. ఎన్ని రోజులు సమావేశాలు కొనసాగించాలనేది నిర్ణయించనున్నారు. కాగా, సమావేశాల తొలిరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి హాజరు కావాలని మాజీ సీఎం జగన్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు మాజీ సీఎం హోదాలో జగన్ వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి పైన శాసనసభా వర్గాలను వైసీపీ నేతలు ఆరా తీసినట్టు తెలిసింది. ఇందుకు శాసనసభ వర్గాలు కూడా సుముఖతను వ్యక్తం చేసినట్టు సమాచారం. 2024 ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, గవర్నర్ ప్రసంగ కార్యక్రమాల కోసం అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారు. ఆ తర్వాత నుంచి శాసనసభా సమావేశాలను బాయ్కాట్ చేస్తూ వస్తున్నారు.

ఎమ్మెల్యేలతో జగన్ ప్రత్యేకంగా సమావేశం

వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ కు గౌరవం ఇచ్చేలా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఓడిన తరువాత గవర్నర్ ప్రసంగానికి మాత్రం హాజరు అవుతున్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నిరసనకు దిగే అవకాశం కనిపిస్తోంది. తమ పార్టీ నేతల ఇళ్ల పైన జరిగిన దాడుల పైన నిరసనకు దిగాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశం తరువాత పార్టీ ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలతో జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణ పైన దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా.. ఎమ్మెల్యేల గైర్హాజరు పైన కూటమి నేతలు వరుసగా విమర్శలు చేస్తున్నారు. సభకు హాజరు కాకుండానే జీత భత్యాలు తీసుకొంటున్నారని.. వారి పైన చర్యలు తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు ప్రభుత్వం పైన రాజకీయంగానూ ఒత్తిడి పెంచే వ్యూహాలతో జగన్ సిద్దం అవుతున్నట్లు సమాచారం. దీంతో.. పార్టీ నేతల సమావేశంలో జగన్ ప్రకటించే నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

నాన్న అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. వృద్ధాశ్రమంలోనే ఖననం

నాన్న అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. వృద్ధాశ్రమంలోనే ఖననం

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

📢 For Advertisement Booking: 98481 12870