ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. పర్యాటకాన్ని ఆర్థిక అభివృద్ధికి ప్రధాన ఆధారంగా మార్చాలనే లక్ష్యంతో టూరిజం డిపార్ట్‌మెంట్ మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో 8 కొత్త పర్యాటక ప్రాంతాల్లో హౌస్‌బోట్లు ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన నదులు, రిజర్వాయర్లలో వీటిని నిర్వహించేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు ఆసక్తి కనబర్చారు.
Read Also: AP Crime: ఆత్మహత్యకు పాల్పడ్డ గ్రామ సచివాలయ ఉద్యోగి
ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాల్లో అందుబాటులోకి హౌస్ బోట్లు
ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన అనుమతులు ఇచ్చేశారు. త్వరలో ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాల్లో హౌస్ బోట్లు అందుబాటులోకి రానున్నాయి.రాజమండ్రిలోని సరస్వతీ ఘాట్, పుష్కర ఘాట్, అనకాపల్లి జిల్లాలోని కొండకాకర్ల సరస్సు, సూర్యలంక, భవానీ ద్వీపం, కడప జిల్లాలోని గండికోట, విశాఖ జిల్లా గంభీరం,

అల్లూరి జిల్లా తాజంగి రిజర్వాయర్‌లో హౌస్ బోట్లు నిర్వహించేందుకు ప్రైవేటు ఆపరేటర్లకు అనుమతులు మంజూరు అయ్యాయి. మొత్తంగా రూ. 10 కోట్ల పెట్టుబడులతో పలు సంస్థలు వీటిని ఏర్పాటు చేయనున్నాయి. ఈ పర్యాటక ప్రాంతాల్లో సింగిల్, డబుల్ బెడ్ రూం హౌస్ బోట్లను నడపనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: