రాష్ట్రవ్యాప్తంగా రానున్న ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే సూచనలు
వాతావరణ సంస్థ స్కైమెట్ నివేదిక ప్రకారం, బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం (low pressure) ఏర్పడే అవకాశం ఉంది. ఇది బలపడుతూ వాయుగుండంగా మారి, శనివారం నాటికి తీరం దాటి రాష్ట్రంపై ప్రభావం చూపనుందని అంచనా. ఈ పరిణామం వల్ల భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 20వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశముంది.
ఈ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం చాన్స్
మంగళవారం నాటికి రాష్ట్రంలోని 12 జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy rains in 12 districts) నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వీటిలో ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ,ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల ఈ జిల్లాల ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇప్పటికే వర్ష బీభత్సం.. కొన్ని జిల్లాల్లో భారీ వానలు
ఇప్పటికే ఆదివారం నుంచి నిన్న ఉదయం వరకు వైఎస్సార్, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, చిత్తూరు, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాల్లో వర్షాలు బాగా కురిశాయి. అలాగే నిన్న పల్నాడు, తూర్పు గోదావరి, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో వర్షపాతం నమోదైంది.
అధికారుల హెచ్చరిక: అప్రమత్తంగా ఉండండి
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు నిర్లక్ష్యం చూపకూడదని, నీటి మిగులు, వాగులు, నదులు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున గ్రామీణ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారుల సూచన. ప్రత్యేకించి రైతులు పంటలకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Read also: