हिन्दी | Epaper

Andhra Pradesh: మండలిలో వాడీవేడి చర్చ.. వైసీపీ సభ్యుల వాకౌట్

Anusha
Andhra Pradesh: మండలిలో వాడీవేడి చర్చ.. వైసీపీ సభ్యుల వాకౌట్

విశాఖపట్నంలో ఐటీ కంపెనీలకు 99 పైసలకే భూములు కేటాయించడంపై ఏపీ (Andhra Pradesh) శాసనమండలిలో వాడీవేడి చర్చ జరిగింది. ఈ అంశాన్ని ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా ప్రశ్నించింది. రియలెస్టేట్ కంపెనీలకు స్థలాలు ఎలా ఇస్తారంటూ వైసీపీ ప్రశ్నించింది. దీనిపై మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. ఏపీకి కంపెనీలు రావడం వైసీపీకి నచ్చదని నారా లోకేశ్ విమర్శించారు. విశాఖలో ఎకో సిస్టమ్ తయారుచేయాలంటే పెద్ద కంపెనీలు రావాలని.. అందుకే ఐదు కంపెనీలకు భూములు లీజుకిచ్చామని తెలిపారు.

Read Also: Tirumala Laddu case: ఈడీ రంగప్రవేశంతో తేలనున్న ‘కల్తీ’ పాపం

వైసీపీకి వాకౌట్ చేయడం అలవాటేగా

విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పారు.ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..ఇతర రాష్ట్రాల్లో కోట్లు పెట్టి కంపెనీలు భూములు కొంటుంటే..విశాఖలో విలువైన భూములను అతి తక్కువ ధరకే అప్పగిస్తున్నారని విమర్శించారు. గీతం యూనివర్శిటీకి రూ. 5 వేల కోట్ల విలువైన భూములను ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది.

Andhra Pradesh: Heated debate in the council.. YCP members walk out
Andhra Pradesh: Heated debate in the council.. YCP members walk out

ప్రభుత్వం భూదోపిడీకి పాల్పడుతోందని బొత్స అన్నారు. గీతంకు భూముల కేటాయింపును నిరసిస్తూ సభ నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. అనంతరం నారా లోకేశ్ మాట్లాడుతూ.. వైసీపీకి వాకౌట్ చేయడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ఈ తలుపు నుంచి వచ్చి ఆ తలుపు నుంచి వెళ్లిపోవడం బొత్స సత్యనారాయణకు అలవాటేనని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870