ప్రధాని నరేంద్ర మోదీ మూడవసారి పదవీబాధ్యతలు స్వీకరించిన తరువాత ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రానికి కేంద్రం నుండి వరుసగా ప్రాజెక్టులు, నిధుల మంజూరుతో పాటు కీలక నిర్ణయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాజెక్టు పునరుద్ధరణకు మద్దతు, పోలవరం ప్రాజెక్టుకు నిధుల మంజూరు, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీ, జాతీయ రహదారుల విస్తరణ వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉండగా, తాజాగా కేంద్రమంత్రివర్గ సమావేశంలో ఏపీకి మరో భారీ రహదారి ప్రాజెక్టుకు ఆమోదం లభించింది.

108 కిలోమీటర్ల నాలుగు వరుసల హైవే – బద్వేలు నుండి కృష్ణపట్నం పోర్ట్ వరకు
కడప జిల్లా బద్వేలు నుంచి నెల్లూరు జిల్లాలోని గురివిందపూడి వరకు 4 వరుసల రోడ్డుకు పచ్చజెండా ఊపింది. 3,653 కోట్ల రూపాయల వ్యయంతో 108 కిలోమీటర్ల పొడవున ఈ రహదారిని నిర్మించనున్నట్లు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ రహదారి నిర్మాణం వల్ల ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉత్తర కర్ణాటకలోని ఆర్థిక కారిడార్‌కు పోర్టు కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పారు.
గ్రీన్‌ఫీల్డ్ మోడల్ & BOOT విధానం ద్వారా నిర్మాణం
ఈ ప్రాజెక్టును డిజైన్-బిల్డ్-ఫైనాన్స్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (DBFOT) మోడల్‌లో నిర్మించనున్నారు. ఇందులో 23 కి.మీ మేర అప్‌గ్రేడ్, 85 కి.మీ మేర గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం, బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో హైవే నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రత్లాం-నగడ రైల్వే మార్గాన్ని 4 వరుసలుగా, అలానే వార్దా-బల్లార్షా రైల్వే మార్గాన్ని కూడా 4 వరుసలుగా మార్పునకు కేబినెట్ నిర్ణయించింది.
ప్రభావిత మండలాలు – అభివృద్ధికి మార్గం
ఈ ప్రాజెక్టులో భాగంగా మనుబోలు మండలం గురువిందపూడి సమీపంలోని కృష్ణపట్నం పోర్టు రోడ్డు నుంచి బద్వేల్ మండలం గోపవరం వరకు 108.13 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించనున్నారు.’పోర్టు రోడ్డు టు బద్వేల్’ జాతీయ రహదారి ప్రాజెక్టును డిజైన్-బిల్ట్-ఫైనాన్స్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్(డీబీఎ్‌ఫవోటీ) పద్ధతిలో నిర్మించనున్నారు. మనుబోలు, పొదలకూరు, చేజర్ల, అనంతసాగరం, మర్రిపాడు మండలాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం జరుపుకోనుంది. ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టు, ఇతర పరిశ్రమల నుంచి వాహనాలు రాయలసీమ ప్రాంతానికి వెళ్లాలంటే ముంబై హైవేపైనే ఆధారపడుతున్నారు. మొత్తంగా ఈ రోడ్డు ప్రాజెక్టుకు రూ.3653.10 కోట్లను ఖర్చు చేయనున్నారు. వచ్చే నెలలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు టెండర్లు పిలిచేందుకు కసరత్తు జరుగుతోంది.
ఆర్థిక కారిడార్, పోర్ట్ కనెక్టివిటీకి
కేంద్ర రవాణా శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపిన ప్రకారం, ఈ రహదారి నిర్మాణం వల్ల కృష్ణపట్నం పోర్ట్ నుండి రాయలసీమ, ఉత్తర కర్ణాటక వరకు వాణిజ్య రవాణా మరింత వేగవంతమవుతుంది. ఇది ప్రాంతీయ ఆర్థిక కారిడార్ అభివృద్ధికి దోహదపడుతుంది. ప్రస్తుతం ఉన్న ముంబయి హైవేపైనే ఆధారపడుతున్న భారీ వాహనాలు ఇక ఈ కొత్త మార్గం ద్వారా తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకోగలవు.