అనంతపురం(Anantapur) పట్టణంలో డీ–మార్ట్ ఎదురుగా ఉన్న నంబూరి వైన్ షాపులో సోమవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వాచ్‌మన్ మంటలు గమనించి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు గంటన్నర పాటు మంటలతో పోరాడి చివరకు అగ్నిని అదుపులోకి తీసుకువచ్చారు.
Read Also: AP: డబ్బులు ఇవ్వలేదని మద్యం షాపుకు నిప్పు..

ఈ ప్రమాదంలో షాపులో(Anantapur) ఉన్న మద్యం నిల్వలు, ఫ్రిజ్లు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ఘటనలో సుమారు రూ.1.30 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు.
వైన్ షాపు యజమాని నంబూరి వెంకటరమణ ఈ అగ్నిప్రమాదం యాదృచ్ఛికం కాదని, రాజకీయంగా తనపై ఉన్న వైరం కారణంగానే జరిగిందని ఆరోపించారు. ఈ ఘటన వెనుక కుట్ర ఉందన్న అనుమానాలతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు. సంక్రాంతి పండుగకు ముందు జరిగిన ఈ అగ్నిప్రమాదం నగరంలో తీవ్ర చర్చకు దారి తీసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: