
Anand Mahindra: పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా హోలీ పండుగ సందర్భంగా సోషల్ మీడియాలో ఆలోచనాత్మక సందేశాన్ని పంచుకున్నారు. భారతదేశపు వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా, దేశంలోని వివిధ రాష్ట్రాలను రంగుల రూపంలో చూపిస్తూ, అవన్నీ కలిసిపోయి ఒక అందమైన హోలీ కానుకలా కనిపించేలా రూపొందించిన AI చిత్రాన్ని ఆయన షేర్ చేశారు.
Read Also: Andhra Pradesh: రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ శాసనమండలి
అనేక రంగులు.. ఒకే కాన్వాస్
మహీంద్రా కేవలం శుభాకాంక్షలతో ఆగిపోకుండా, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మిరప సాగుకు సంబంధించిన ఒక అద్భుతమైన వీడియోను పంచుకున్నారు. దేశ మిరప ఉత్పత్తిలో 15% వాటా ఉన్న గుంటూరులో, ఆరబోసిన ఎర్రటి మిరపకాయలు పై నుంచి చూస్తే ఒక గొప్ప కళాఖండంలా కనిపిస్తాయని ఆయన కొనియాడారు. “ఇది చూడటానికి ఒక సహజమైన హోలీ కాన్వాస్‌లా ఉంది” అని ఆయన అభివర్ణించారు.
ఈ సీజనల్ పంటను పర్యాటక ఆకర్షణగా (Tourism Attraction) మార్చలేమా? అని మహీంద్రా ప్రశ్నించారు. ఇందుకోసం ఆయన కొన్ని ఆసక్తికరమైన ఐడియాలను కూడా పంచుకున్నారు. హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ నేల మీద కంటే పై నుంచి చూస్తేనే ఈ అందం కనిపిస్తుంది కాబట్టి బెలూన్ రైడ్స్ ఏర్పాటు చేయవచ్చు. సాంస్కృతిక ప్రదర్శనలు పర్యాటకుల కోసం స్థానిక సంగీతం, నృత్య ప్రదర్శనలు నిర్వహించవచ్చు. రైతులకు అదనపు ఆదాయం దీనివల్ల స్థానిక రైతులు, సమాజాలకు అదనపు ఆదాయం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: