అనకాపల్లి (Anakapalli) జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేట ఆర్టీసీ బస్డాండులో అర్ధరాత్రి పూట చిమ్మ చీకటిలో ఎముకలు కొరిగే చలిలో నడి రోడ్డుపై పడున్న ఓ శిశువు ఆవేదన ఇది. తొమ్మిది నెలలు మోసి కన్న తల్లి ఎందుకు వదిలేసిందో తెలియదు బతుకు భారమా పాపభారమా అనేది ఆ దేవుడికే తెలియాలి. కానీ ఎముకలు గడ్డ కట్టే చలిలో బొడ్డు కూడా ఊడకముందే ఆ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి. బుధవారం ఆర్థరాత్రి పూట కృష్ణదేవిపేట ఆర్టీసీ బస్టాండులో కొంతమంది ప్రయాణికులకు రోడ్డుపై శిశువు కనిపించింది.
ప్రయాణికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక ఎస్ఐ వెంటనే అక్కడకు చేరుకున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ (Women and Child Welfare Department) అధికారులకు సమాచారం అందించారు. దీంతోఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీసర్, ఓ అంగన్నాడీ కార్యకర్త వెంటనే అక్కడకు చేరుకున్నారు.

Read Also: TIDCO: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. త్వరలో పేదలకు కొత్త ఇళ్లులు
శిశువును కృష్ణదేవిపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. (Anakapalli) అయితే అప్పటికే ఆ పసికందు ఊపిరి ఆగిపోయింది ఎముకలు గడ్డకట్టే చలికి ఆ పసిప్రాణం తట్టుకోలేకపోయింది. కృష్ణదేవిపేటలో పసికందును పరీక్షించిన డాక్టర్లు చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో శిశువు మృతదేహాన్ని నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు రాత్రిపూట శిశువును బస్టాండులో ఎవరు వదిలేసి పోయారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: