हिन्दी | Epaper

Amaravati: అమరావతి అభివృద్ధికి బలమైన పునాదుల దిశగా చంద్రబాబు అడుగు

Sharanya
Amaravati: అమరావతి అభివృద్ధికి బలమైన పునాదుల దిశగా చంద్రబాబు అడుగు

తెలుగుదేశం పార్టీ నేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యంగా స్పష్టంచేశారు అమరావతికే పట్టం. అది శాశ్వత రాజధానిగా అభివృద్ధి చెందుతుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజధాని అంశంపై ఏర్పడిన అపార్థాలు, రైతులకు కలిగిన అన్యాయం పునరావృతం కాకుండా చూస్తామని ఆయన తెలిపారు.

చంద్రబాబు మోదీ ప్రభుత్వానికి పూర్తిగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అమరావతికి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత ఇవ్వాలన్న నిబద్ధతతో పార్లమెంటులో చట్టం తేవాలని స్పష్టం చేశారు. రీజినల్ రాజధానుల నిబంధనల వల్ల ఇప్పటివరకు ఆ అవకాశం లేకపోయినప్పటికీ, ఇప్పుడు తాము అధికారంలో ఉన్నందున మళ్ళీ దానికి మార్గం వస్తుందన్నారు.

రాజధాని రైతులకు భరోసా

చంద్రబాబు ఇటీవల అమరావతి భూదాత రైతులతో భేటీ అయ్యారు. గతంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామని, వీటిపై ఇప్పటికే ఆర్థిక, పరిపాలనా స్థాయిలో చర్యలు మొదలుపెట్టామని చెప్పారు. రైతులకు పింఛన్లు, కౌలు, విద్యావిధానం వంటి అంశాలలో మునుపటి మాదిరిగానే సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కౌలు సొమ్ము తక్కువగా ఉందని రైతులు చెప్పిన నేపథ్యంలో, ఆ మొత్తాన్ని పెంచే యోచనలో ఉన్నామన్నారు. అభివృద్ధి అవసరాల మేరకే తదుపరి భూ సమీకరణ ఉంటుందని స్పష్టం చేశారు.

అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం పై చర్చ

రైతులతో జరిగిన సమావేశంలో చంద్రబాబు, అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం గురించి వివరించారు. ఒక నగరం అభివృద్ధి చెందాలంటే విమానాశ్రయం కీలకం. పెట్టుబడులు ఆకర్షించాలంటే అంతర్జాతీయ కనెక్షన్లు అవసరం అని అన్నారు. నగరం యొక్క విస్తరణకు, గ్లోబల్ కనెక్టివిటీకి విమానాశ్రయం అత్యంత అవసరం మౌలిక సదుపాయాల కల్పనతో పెట్టుబడిదారుల నమ్మకం పెరుగుతుంది. నగరానికి పెట్టుబడులు, అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటే కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. చంద్రబాబు వివరణతో సంతృప్తి చెందామంటున్నారు.

మోదీ పర్యటన

రాజధాని పనులపై ఓ వైపు భూములిచ్చిన రైతులకు భరోసా ఇస్తూనే మరోవైపు ప్రధాని మోదీ పర్యటనకు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రధాని పర్యటనపై ఎన్డీఏ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మోదీ అమరావతి పర్యటన విజయవంతం చేద్దామని రాజధాని పునర్నిర్మాణ పనులతో అభివృద్ధికి మళ్లీ ఊపిరి ఇద్దామని చెప్పారు. అమరావతిని మళ్లీ జాతీయ స్థాయిలో చర్చకు తెచ్చే విధంగా ఈ పర్యటనను ప్లాన్ చేస్తున్నారని చెప్పారు.

read also: Weather: ఓ వైపు ఎండలు మరో వైపు వర్షాలు దిక్కు తోచని ప్రజలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870