దేశంలో అత్యంత వెనుకబడిన ఆదివాసీగిరిజన సమూ హాలుగా గుర్తించబడిన పివిటిజి కమ్యూనిటీల జీవన పరిస్థితులు మెరుగుపడాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జంజాతి ఆదివాసీ (Adivasis)న్యాయ మహా అభియాన్ (పిఎం జంజాతి) పథకాన్ని తీసుకొచ్చింది. ఈ కార్య క్రమం 18 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్న 75 పివిటి సమూహాలకు ఉద్దేశించబడింది. మూడు సంవ త్సరాల కాలంలో పివిటిజి కుటుంబాలు, నివాస ప్రాంతాలకు సురక్షిత గృహాలు, శుభ్రమైన తాగునీరు, విద్య, ఆరోగ్యం, పోషణ సేవలకు చేరువ, రోడ్డు, టెలికాం కనెక్టివిటీ, విద్యుత్ సౌకర్యం లేనిగృహాలకు విద్యుదీకరణ, స్థిరమైన జీవనోపాధి అవకాశాలు వంటి ప్రాథమిక సదుపాయాలు అందేలా చేయ డమే దీనిలో ప్రధాన ఉద్దేశం. ఈ లక్ష్యాలను వివిధ శాఖల సమన్వయంతో అనేక కార్యాచరణల ద్వారా అమలు చేయా లని ప్రభుత్వం ప్రకటించింది. లక్ష్యం గొప్పదే. కానీ ఆంధ్ర ప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన ఆదివాసి పివిటిజి నిరుపేద కుటుంబాలకు ఈ పథకం కింద గృహాలు వాస్తవంగా ఆశించినా దాని కంటే మేలు చేస్తాయా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నిర్మిస్తున్న పిఎం జంజాతి గృహాలు కొన్నిచోట్ల సగటు నిరుపేద కుటుంబా లకు శాపంగా మారుతున్నాయి. ఇల్లు కట్టుకోవడం ప్రతి నిరుపేద కుటుంబం కల. మరీ ముఖ్యంగా వెనకబడిన పివి జిటి కుటుంబాలు పూరి గుడిసెల్లో జీవిస్తూ కొండలు అడ వుల్లో జీవనం కొనసాగిస్తుంటారు. వీరు బయట ప్రపంచానికి దూరంగా ఎన్నో కట్టుబాట్లతో జీవనం సాగిస్తుంటారు. ఇప్పటి పరిస్థితుల్లో ఇల్లు కట్టాలంటే ఇంటి సామాగ్రి సిమెంట్, ఇనుము, ఇసుక వంటి వాటిని మైదాన ప్రాంతం నుంచి కొనుగోలు చేసి గ్రామాలకు తీసుకురావాల్సి ఉంటుం ది. కానీ రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల ఆ సామాగ్రి చేర్చడంలోనే అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు సిమెంట్, ఇనుము కొనుగోలు ఖర్చుకంటే వాటినిగ్రామాలకు చేర్చడానికి అయ్యే రవాణా ఖర్చే ఎక్కువ అవుతుందని చెప్పవచ్చు.
Read Also : RBI: ప్రభుత్వ ఖాతాలోకి లక్షల కోట్లు..సామాన్యులకు పన్ను ఊరట?

అల్లూరి జిల్లాలో రోడ్డు లేని పివిజిటి గ్రామాలు చాలానే ఉన్నాయి. రహదారి మార్గాలు లేకపోవడం వల్ల కొంత దూరం వరకు వాహనాల్లో తరలించి అక్కడ దించు కుని ఆ తర్వాత మనుషులు ఎత్తుకొని తీసుకెళ్లే పరిస్థితులు కూడా అనేకం ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే (పిఎం జంజాతి) గృహాలు పివిజిటి నిరుపేద కుటుం బాలకు ఒక రకంగా అగ్ని పరీక్షగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం (పిఎం జంజాతి) గృహాల నిర్మాణానికి రెండు లక్షలముప్పై తొమ్మిదివేల రూపాయలు మంజూరు చేసింది. అయినప్పటికీ ఇల్లు కట్టుకోవడానికి సరైన సౌకర్యాలు లేక పోవడం వల్ల అప్పు తీసుకునే పరిస్థితిగా మారుతోంది. మొత్తంగా ఒక ఇల్లు పూర్తి చేయడానికి ఎనిమిది నుంచిపది లక్షల వరకు ఖర్చయ్యే అంచనా ఉంది. ప్రభుత్వం ఇచ్చే 2,39,000 సహాయం ఉన్నా, మిగిలిన మొత్తం సగటు కుటుంబంపై భారీ ఆర్థిక భారం అవుతోంది. అంటే సుమారుగా ఏడులక్షల అరవై ఒక వేల రూపాయలు సగటు కుటుంబానికి భారం పడుతుందని చెప్పడానికి సందేహం లేదు. సగటు కుటుంబం ఇంత ధనాన్ని వెచ్చించగలదా అనే ప్రశ్న సహజంగా వస్తుంది. ఉదాహరణకు అల్లూరి జిల్లాలోని జిమాడుగుల మండలం గడుతూరు పంచాయతీ బొడ్డు మామిడి గ్రామం మండల కేంద్రం నుంచి సుమారు గా అరవై కిలోమీటర్లు దూరంలో ఉంది. ఈ గ్రామానికి వెళ్లడానికి ఎటువంటి రోడ్డు సౌకర్యంలేదు. ఈ ఒక్క గ్రామం లో యాభై కుటుంబాలు నివసిస్తున్నారు. ఈ గ్రామంలో కొంతమందికి ఇప్పటికీ రేషన్ కార్డులు లేవు, మరి కొంత మందికి ఆధార్ కార్డులు లేవు. మరికొన్ని కుటుంబాలకు (ఎన్ఆర్జిఎ) జాబ్ కార్డులు కూడా లేవు. అందులో ఈ కేంద్ర ప్రభుత్వం (పిఎం జంజాతి) పథకం ద్వారా కొంతమం దికి మాత్రమే గృహాలు మంజూరు చేయటం జరిగింది. ఎందుకంటే జాబ్కార్డు ఈ పథక గృహాలకు ముఖ్యమైనదిగా అధికారులు నిర్ణయించినట్లు కనిపిస్తోంది. ఇలాంటి గ్రామా లు ఇంకా మరెన్నో మనకు పాడేరు జిల్లాలోకనిపిస్తాయి. ఇంకా గతంలో అల్లూరిజిల్లాలో పెద్దసంఖ్యలో(ఎన్ఆర్ఆజిఎ) జాబ్ కార్డులు తొలగింపుకు గురైన సందర్భాలున్నాయి. ఈ విషయమై గతంలో అల్లూరి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ చాలా గ్రామాల్లో సమస్య అలాగే ఉంది. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అల్లూరి జిల్లాలోని గ్రామాలను అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయిలో సందర్శించి రోడ్లు, మంచినీరు, విద్యుత్, విద్య సదు పాయాలు కల్పించగలిగితేనే ఈపథకం నిజంగా ఉపయోగప డుతుంది. అంతేకాకుండా స్థానిక పాడేరు ఐటిడిఏ అధికారు లు, జిల్లాకలెక్టర్ కార్యాలయం ఈవిషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఇల్లుకంటే ముందు దారిరావాలి. అప్పుడే ఆదివాసీల (Adivasis)సొంత ఇంటి కల నిజంగా నెరవేరుతుంది.
-మల్లేశ్ పొంగి
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: