ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి విస్తృత స్థాయిలో దాడులు (ACB Raids) నిర్వహించారు. విజయనగరం, రేణిగుంటతో పాటు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో చేపట్టిన ఈ సోదాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. విజయనగరంలో హోంగార్డ్ శ్రీనివాసరావు నివాసం, ఆయన బంధువుల ఇళ్లపై దాడులు (ACB Raids) జరిగాయి. విశాఖలో కూడా ఆయన బంధువుల నివాసాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి తిరుమలేష్ నివాసాలపై కూడా దాడులు జరిగాయి. రేణిగుంట, తిరుపతి, నెల్లూరులోని మొత్తం 5 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
Read Also: AP High Court: ఏఐని వినియోగించడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: