amit shah

త్రివేణి సంగమంలో అమిత్‌షా పవిత్ర స్నానం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మేళాగా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ‘మహాకుంభ్‌’ లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సోమవారంనాడు పాల్గొన్నారు. గంగా, యుమనా, సరస్వతీ నదులు సంగమించే త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. దీనికి ముందు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్న అమిత్‌షాకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర మంత్రులు సాదర స్వాగతం పలికారు.
అమిత్‌షా షెడ్యూల్ ప్రకారం, బడే హనుమాన్ జీ ఆలయాన్ని సందర్శిస్తారు. జునా అఖారాను సందర్శించి అఖారా మహరాజ్, ఇతర అఖారా సాధువులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు. గురు శరణానంద్ జీ అశ్రమాన్ని సందర్శించి గురు శరణానంద్, గోవింద్ గిరి జీ మహరాజ్‌ను కలుసుకుంటారు. అనంతరం శృంగేరి, పూరి, ద్వాకరా శంకరాచార్యులను కలుసుకోవడంతో ఆయన పర్యటన ముగుస్తుంది. సాయంత్రం ప్రయాగ్‌రాజ్ నుంచి బయలుదేరి తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు.

Advertisements

మహాకుంభ కీలక రోజులు కావడంతో మహాకుంభ్ ఏరియాలో ‘నో వెహికల్ జోన్’ ప్రకటించారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకూ వెహికల్ పాస్‌లు చెల్లవని మహాకుంభ్ మీడియా సెంటర్ ప్రకటించింది. సమీపంలోని పార్కింగ్ ప్రాంతాల్లో మాత్రమే వాహన యజమానులు పార్కింగ్ చేసుకోవాలని సూచించింది. మహాకుంభ్‌ భద్రతా ఏర్పాట్ల కోసం 10,000కు పైగా స్థానిక పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించారు. జనవరి 29న మౌని అమావాస్య (రెండవ సాహి స్నాన్), ఫిబ్రవరి 3 వసంత పంచమి (మూడవ సాహి స్నాన్), ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26న మహా శివరాత్రి భక్తులు విశేషంగా హాజరుకానున్నారు.

Related Posts
ప్రియాంకపై పోటీ.. ఎవరీ నవ్యా హరిదాస్?
navya haridas details

నవ్యా హరిదాస్ బీజేపీకి చెందిన ప్రముఖ మహిళా నాయకురాలు, ప్రస్తుతం వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీకి (కాంగ్రెస్) వ్యతిరేకంగా పోటీ చేయనున్నారు. ఆమె బీటెక్ Read more

  ఎస్‌సీ, ఎస్‌టీ మ‌హిళల‌కు గుడ్‌న్యూస్
nirmala

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తాజాగా కేంద్ర బ‌డ్జెట్‌-2025ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈ బ‌డ్జెట్‌లో షెడ్యూల్ కులాలు, తెగ‌ల‌కు చెందిన‌ మ‌హిళ‌ల‌కు కేంద్రం తీపి క‌బురు చెప్పింది. Read more

ఎగ్జిట్ పోల్స్: మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు నవంబర్ 23న ప్రకటించబడతాయి
exit poll

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలలో జరిగిన ఉత్కంఠభరితమైన ఎన్నికల తరువాత, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ రెండు రాష్ట్రాలలో ఎన్నికలు తీవ్రమైన పోటీల మధ్య సాగాయి. Read more

NarendraModi: క్లిష్ట పరిస్థితుల్లో అండగా ఉంటామన్న మోదీ..
NarendraModi: క్లిష్ట పరిస్థితుల్లో అండగా ఉంటామన్న మోదీ..

మయన్మార్‌లో చోటుచేసుకున్న భారీ భూకంపం అనంతరం, భారత ప్రభుత్వం "ఆపరేషన్ బ్రహ్మ" పేరిట సహాయ చర్యలను ప్రారంభించింది. విపత్తు సహాయక సామగ్రిని, అత్యవసర సేవలను అందించేందుకు భారత Read more

×