nirmala

  ఎస్‌సీ, ఎస్‌టీ మ‌హిళల‌కు గుడ్‌న్యూస్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తాజాగా కేంద్ర బ‌డ్జెట్‌-2025ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈ బ‌డ్జెట్‌లో షెడ్యూల్ కులాలు, తెగ‌ల‌కు చెందిన‌ మ‌హిళ‌ల‌కు కేంద్రం తీపి క‌బురు చెప్పింది. ఎస్‌సీ, ఎస్‌టీ మ‌హిళల కోసం ట‌ర్మ్ లోన్ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించింది. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు అందించ‌నున్న‌ట్లు నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. ఈ ప‌థ‌కం ద్వారా మొత్తం 5 ల‌క్ష‌ల మంది ఎస్‌సీ, ఎస్‌టీ మ‌హిళల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. తొలిసారి సొంత వ్యాపారాల‌ను ప్రారంభించే, ఉన్న వ్యాపారాల‌ను విస్త‌రించాల‌నుకునే మ‌హిళ‌ల‌కు ఈ ప‌థ‌కం ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే ఈ ప‌థ‌కం ద్వారా దేశ‌వ్యాప్తంగా మ‌హిళ‌ల‌కు, ఎస్‌సీ, ఎస్‌టీ వ‌ర్గాల‌కు చెందిన వారికి ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పారు.  

Related Posts
రాష్ట్రీయ విద్యా దినోత్సవం!
edu

ప్రతి సంవత్సరం నవంబర్ 11న రాష్ట్రీయ విద్యా దినోత్సవం జరుపుకుంటాము. ఈ రోజు, భారతదేశం స్వతంత్రం తరువాత తొలి విద్యా మంత్రి అయిన మౌలానా అబుల్ కలామ్ Read more

ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది భారత పౌరులు మృతి
Fatal road accident in Saudi Arabia.. 9 Indian citizens killed

సౌదీ ఆరేబియా: సౌదీ ఆరేబియా లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది భారత పౌరులు దుర్మరణం పాలయ్యారు. సౌదీ అరేబియా Read more

న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు రావొద్దు – అయ్యన్న
ayyanna patrudu

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పేందుకు తన వద్దకు ఎవరూ రావొద్దని అభ్యర్థించారు. ఇది మాజీ భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ Read more

వామ్మో.. నీతా అంబానీ వాడే వాటర్ బాటిల్ విలువ రూ. 49 లక్షలు
nita ambani water bottle co

రిలయన్స్ అధినేత ముకేశ్ భార్య నీతా అంబానీ తాగే వాటర్ బాటిల్ విలువ అక్షరాలా రూ.49 లక్షలు. నీతా అంబానీ, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ భార్యగా, Read more