amit shah

త్రివేణి సంగమంలో అమిత్‌షా పవిత్ర స్నానం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మేళాగా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ‘మహాకుంభ్‌’ లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సోమవారంనాడు పాల్గొన్నారు. గంగా, యుమనా, సరస్వతీ నదులు సంగమించే త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. దీనికి ముందు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్న అమిత్‌షాకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర మంత్రులు సాదర స్వాగతం పలికారు.
అమిత్‌షా షెడ్యూల్ ప్రకారం, బడే హనుమాన్ జీ ఆలయాన్ని సందర్శిస్తారు. జునా అఖారాను సందర్శించి అఖారా మహరాజ్, ఇతర అఖారా సాధువులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు. గురు శరణానంద్ జీ అశ్రమాన్ని సందర్శించి గురు శరణానంద్, గోవింద్ గిరి జీ మహరాజ్‌ను కలుసుకుంటారు. అనంతరం శృంగేరి, పూరి, ద్వాకరా శంకరాచార్యులను కలుసుకోవడంతో ఆయన పర్యటన ముగుస్తుంది. సాయంత్రం ప్రయాగ్‌రాజ్ నుంచి బయలుదేరి తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు.

మహాకుంభ కీలక రోజులు కావడంతో మహాకుంభ్ ఏరియాలో ‘నో వెహికల్ జోన్’ ప్రకటించారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకూ వెహికల్ పాస్‌లు చెల్లవని మహాకుంభ్ మీడియా సెంటర్ ప్రకటించింది. సమీపంలోని పార్కింగ్ ప్రాంతాల్లో మాత్రమే వాహన యజమానులు పార్కింగ్ చేసుకోవాలని సూచించింది. మహాకుంభ్‌ భద్రతా ఏర్పాట్ల కోసం 10,000కు పైగా స్థానిక పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించారు. జనవరి 29న మౌని అమావాస్య (రెండవ సాహి స్నాన్), ఫిబ్రవరి 3 వసంత పంచమి (మూడవ సాహి స్నాన్), ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26న మహా శివరాత్రి భక్తులు విశేషంగా హాజరుకానున్నారు.

Related Posts
గగన్ యాన్ కోసం సముద్రయానం పరీక్షలు
Sea trials for the Gaganyaan

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్ యాన్ ముందస్తు పరీక్షలు. పరిశోధనలు ముమ్మరం చేసింది. మరోసారి సముద్రంలో రికవరి పరిశోధనలు మొదలయ్యాయి. భారతీయ నావికాదళం, ఇస్రో సంయుక్తంగా Read more

AndhraPradesh :తప్పిపోయి 20 ఏళ్లకు కుటుంబ సభ్యుల వద్దకు
AndhraPradesh :తప్పిపోయి 20 ఏళ్లకు కుటుంబ సభ్యుల వద్దకు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుక్కు కూలీపనుల కోసం తమిళనాడుకు వెళ్తూ మార్గమధ్యంలో తప్పిపోయాడు. 22 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు తన కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్నాడు. బ్రతుకుతెరువు Read more

సూసైడ్ లెటర్ చెల్లుబాటు కాదు, ఆధారాలు కావాలి: సుప్రీంకోర్టు

ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరంలో దోషిగా తేలిన వ్యక్తిని సుప్రీంకోర్టు నిర్ధోషిగా విడుదల చేసింది. నిందితుడు మృతురాలిని అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేశాడని, తద్వారా ఆమె ఆత్మహత్యకు Read more

స్నానం కాదు ఆ నీళ్లు తాగే దమ్ముందా: అఖిలేష్ యాదవ్
yogi adityanath

దేశరాజధాని ఢిల్లీలో మరికొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈక్రమంలోనే ప్రధాన పార్టీలన్నీ పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి మద్దతు Read more