Donald Trump: ట్రంప్ పరిపాలన చర్యలకు వ్యతిరేకంగా అమెరికన్ల నిరసన

Donald Trump: ట్రంప్ పరిపాలన చర్యలకు వ్యతిరేకంగా అమెరికన్ల నిరసన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. శత్రు, మిత్ర దేశం అనే తేడా లేకుండా అన్ని దేశాల ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తూ అమెరికా కఠిన వైఖరి చూపిస్తోంది. టారిఫ్‌ల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం ఖాయం కావడంతో, అమెరికాలో ప్రజలు షాపింగ్ మాల్స్ వద్ద క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు,ఇంటికి సంబందించిన వస్తువుల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన టారిఫ్‌లు ఏప్రిల్ 5 నుంచి అమలులోకి వచ్చాయి. ప్రారంభంలో 10 శాతం సుంకాలు విధించినప్పటికీ, మిగతా భాగాన్ని ఏప్రిల్ 10 నుంచి వసూలు చేస్తామని వెల్లడించింది.అయితే, కొన్ని దిగుమతులకు మే 27 వరకు గ్రేస్ పీరియడ్ ఉండటంతో ఆ లోపు సరుకులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత మొదలైంది. రెవెన్యూ సర్వీసుల నుంచి 20 వేల మంది తొలగించారు. ఖర్చులు తగ్గించుకునేందుకే ఉద్యోగాల కోత విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. టారిఫ్ బాదుడు, ట్యాక్సులతో ట్రంప్ కంపెనీ నడుపుతున్నారా? కంట్రీని నడుపుతున్నారా అనే అనుమానం కలిగిస్తోంది. అటు ట్రంప్‌ కార్పోరేట్‌ కల్చర్‌తో అమెరికాలోను హాట్‌ టాఫిక్‌గా మారింది. ట్రంప్‌ టారిఫ్‌లతో ఆర్థికవేత్తలే కాదు యావత్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Advertisements

నిరసన కార్యక్రమం

ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ పరిపాలన చర్యలకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ట్రంప్, మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 50 రాష్ట్రాల నుంచి ప్రజలు ఈ ఆందోళనలలో పాల్గొన్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక జరిగిన అతిపెద్ద నిరసన కార్యక్రమం ఇదేనని అక్కడి రాజకీయ వర్గాలు తెలిపాయి. ముందుచూపు లేకుండా ట్రంప్, మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వాణిజ్య యుద్ధాలు జరుగుతాయని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

వ్యతిరేక విధానాలు

‘హ్యాండ్స్ ఆఫ్’ పేరుతో డొనాల్డ్ ట్రంప్ పరిపాలన చర్యలకు వ్యతిరేకంగా వేలాది మంది,దేశవ్యాప్తంగా 1,200 పైగా ప్రదేశాలలో నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ‘ట్రంప్ గో బ్యాక్’, ‘హాండ్స్ ఆఫ్ డెమోక్రసీ’, ‘మస్క్ వాస్ నాట్ ఎలెక్టెడ్’ వంటి నినాదాలతో వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, చికాగో, మయామీ వంటి నగరాల్లోని స్టేట్ క్యాపిటల్ భవనాలు, ఫెడరల్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్ అమలు చేస్తున్న వలస వ్యతిరేక విధానాలు, టారిఫ్ ల విధింపు, మస్క్ చేతిలో ప్రభుత్వ డేటా గోప్యతపై ప్రజలు ఆందోళనలను చేపట్టారు.

Read Also: Donald Trump: ట్రంప్ పరిపాలన చర్యలకు వ్యతిరేకంగా అమెరికన్ల నిరసన

Related Posts
గాజా నుంచి ఎవరినీ బహిష్కరించం..వేరే చోటికి తరలిస్తాం: ట్రంప్‌
అమెరికాలో ఆటోమోటివ్ వాహనాలపై భారీగా పన్ను

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గాజా పౌరులను వేరే చోటికి తరలించి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా Read more

మార్క్ బర్నెట్‌ను యూకే ప్రత్యేక రాయబారిగా నియమించిన ట్రంప్
Mark Burnett

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ శనివారం కీలకమైన ప్రకటన చేశారు. ఆయన ప్రముఖ టెలివిజన్ నిర్మాత అయిన మార్క్ బర్నెట్‌ను యూకే (ఐక్యరాజ్యమైన బ్రిటన్)కి ప్రత్యేక Read more

NIA : తహవూర్ రాణా వాయిస్ శాంపిల్స్ సేకరిస్తున్న ఎన్ఐఏ
NIA collecting voice samples of Tahawwur Rana

NIA : ముంబై 26/11 ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణా ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదుపులో ఉన్నాడు. ముంబై దాడులకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేసిన Read more

Donald Trump: బైడెన్ పాలనలో పెరిగిన వాణిజ్య లోటు: ట్రంప్
: బైడెన్ పాలనలో పెరిగిన వాణిజ్య లోటు: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్ ఆర్థిక విధానంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాల విషయంలో తగ్గేదేలే అన్నట్లు చెప్పకనే చెప్పారు. అనేక దేశాలు తమ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×