టాప్-5 నగరాల్లో ఒకటిగా అమరావతి అభివృద్ధి!

టాప్-5 నగరాల్లో ఒకటిగా అమరావతి అభివృద్ధి!

రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రులకు కొత్త రాజధానిగా అమరావతి ప్రాంతం ప్రతిపాదించబడిన సంగతి తెలిసిందే. అయితే రాజకీయ పార్టీల మార్పుల ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్మేసి.. ఆలస్యం చేస్తూ వచ్చింది. అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావటంతో దీని పనులను ప్రస్తుతం వేగవంతంగా ముందుకు నడిపించాలని చూస్తోంది.

ప్రపంచశ్రేణి రాజధాని నగరంగా..
వివరాల్లోకి వెళితే అమరావతి రాజధాని ప్రాంతంలో దాదాపు 5 వేల ఎకరాల కంటే పెద్దదిగా డిజైన్ చేయబడింది. అయితే గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు రాష్ట్రాన్ని ఆర్థికంగా కుంగదీసే అవకాశాల కారణంగా ప్రజలపై భారం పడకూడదనే ఉద్ధేశంతో పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనికి ఒక చక్కడి పరిష్కారంతో ముందుకొచ్చింది. కేవలం రూ.64 వేల కోట్లతో రాజధాని అమరావతి నగర నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ప్రపంచశ్రేణి రాజధాని నగరంగా తీర్చిదిద్ది ప్రపంచంలోని టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు.

టాప్-5 నగరాల్లో ఒకటిగా అమరావతి అభివృద్ధి!

అంతర్జాతీయ, జాతీయ స్థాయి విద్యాసంస్థలు

మెుత్తం అమరావతి కోసం సేకరించిన 5000 ఎకరాల్లో నిర్మాణం చేయనున్న ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రజల పన్నుల నుంచి వచ్చే సొమ్మును వినియోగించబోవటం లేదని అన్నారు. దీని వల్ల ప్రజలపై ఎలాంటి అదనపు పన్ను భారం ఉండబోదని నారాయణ వెల్లడించారు. అయితే ఈ 5,000 ఎకరాల భూమిలో 1,200 ఎకరాలు అంతర్జాతీయ, జాతీయ స్థాయి విద్యాసంస్థలు, పాఠశాలలు, పరిశ్రమల స్థాపనకు టాయించబడ్డాయి. అన్ని సదుపాయాలు కల్పించిన తరువాత మిగతా భూమిని మంచి ధరకు అమ్మి ఆ ఆదాయాన్ని రాజధాని నిర్మాణానికి తీసుకున్న అప్పులను తీర్చడానికి వినియోగించనున్నట్లు ఆయన చెప్పారు.

HUDCO, ADB బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు

సీఎం చంద్రబాబు నాయుడు తన అనుభవంతో ఆమరావతిని ఒక అద్భుతమైన నగరంగా రూపొల్పొడినట్లు నారాయణ చెప్పారు. ఆమరావతి రాజధాని నిర్మాణానికి రూ.64,000 కోట్ల అంగీకారం పొందగా.. ఇందులో రూ.50,000 కోట్ల టెండర్లు ఇప్పటికే పిలవబడ్డాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం కోసం HUDCO, ADB బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ నిధులు సమకూరుస్తున్నాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో రాజధానికి రూ.6,000 కోట్లు కేటాయించబడ్డాయి.అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తానని సీఎం హామీ ఇచ్చారు. రాజధాని నిర్మాణంలో అంగీకరించిన నిధులపట్ల పారదర్శకతను పాటిస్తామని, ఎటువంటి మోసం జరగనీయబోమని నారాయణ అన్నారు. స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ప్రకారం క్రమాన్ని అనుసరిస్తున్నామన్నారు మంత్రి. ఈ విషయంలో గత ప్రభుత్వాలు చేసిన విధంగా నిధులను దారిపోగొట్టడం జరుగకుండా కాపాడుకుంటున్నట్లు తెలిపారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రతిపక్షం చెప్పే మాటలను ప్రజలు నమ్మెుద్దని సూచించారు.

Related Posts
ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయండి: రాజ్‌నాథ్ సింగ్‌కు లోకేశ్ విజ్ఞప్తి
Set up defense cluster in AP.. Lokesh appeals to Rajnath Singh

న్యూఢిల్లీ: రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా నారా లోకేశ్ ఈనెల Read more

వంశీ అరెస్ట్ పై సునీత స్పందన
వంశీ అరెస్ట్ పై సునీత స్పందన

వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్‌పై హోంమంత్రి అనిత స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వంశీ తప్పు చేసినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని. ఆధారాలతో వంశీని అరెస్టు Read more

తాడేపల్లి ఇంటికి ఊడిగం చేసే ముఠా ఆ వ్యక్తులు – పట్టాభి
pattabhi jagan

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్.. జగన్-షర్మిల ఆస్తుల పంపకం వివాదంపై స్పందించారు. జగన్ కుటుంబంలో ఫ్యామిలీ డ్రామా నడుస్తుందని, తాడేపల్లి ఇంటికి విధేయంగా పనిచేస్తున్న Read more

జైలు నుంచి విడుదలైన నందిగాం సురేష్
జైలు నుంచి విడుదలైన నందిగాం సురేష్

వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్‌ జైలు నుండి విడుదలయ్యారు. వెలగపూడికి చెందిన మరియమ్మ అనే మహిళ హత్య కేసులో గుంటూరు కోర్టు వైఎస్‌ఆర్‌సీపీ Read more