ఒకవైపు భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా మరోవైపు భారతీయ ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ (Airtel) చైర్మన్ సునీల్ మిట్టల్ (Sunil Mittal Airtel) ఒక పెద్ద డీల్ కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. మీడియా నివేదికల ప్రకారం సునీల్ మిట్టల్ చైనా కంపెనీ హైయర్ (Haier ) స్మార్ట్ హోమ్ ఇండియా యూనిట్‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం..
అయితే 2 బిలియన్ డాలర్ల అంటే ఇండియా కరెన్సీ ప్రకారం సుమారు రూ. 17 వేల కోట్ల విలువైన ఈ ఒప్పందానికి సునీల్ మిట్టల్(Sunil Mittal) ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్ పింకస్‌తో చేతులు కలిపారు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, కొన్ని ప్రస్తుతం ఆమోదాలు పెండింగ్‌లో ఉన్నాయి, ఈ కారణంగా ఈ డీల్ పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతోంది, అయితే ఈ ఒప్పందం రాబోయే కొన్ని వారాల్లో పూర్తయ్యే అవకాశం కూడా ఉంది.

ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చలు ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నాయి. మరోవైపు Haier కంపెనీ సంస్థ కూడా వాటాను విక్రయించడానికి నిరాకరించవచ్చు. ప్రస్తుతం, సునీల్ మిట్టల్ అండ్ వార్‌బర్గ్ పింకస్ ప్రతినిధులు ఈ ఒప్పందంపై మాట్లాడడానికి నిరాకరించారు. ఇది కాకుండా Haier కంపెనీ కూడా ఈ విషయంలో ఎలాంటి ప్రకటనలు చేసేందుకు కూడా దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
గత ఏడాది అక్టోబర్‌లో కూడా వాటా అమ్మకం
గత ఏడాది అక్టోబర్‌లో కూడా కంపెనీ భారతీయ యూనిట్‌లో 25 నుంచి 49 శాతం వాటాను విక్రయించాలని యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. నవంబర్‌లో సింగపూర్‌కు చెందిన టెమాసెక్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంకా జిఐసి ప్రైవేట్ లిమిటెడ్ అలాగే అబుదాబికి చెందిన సావరిన్ వెల్త్ ఫండ్ ముబాదలా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించాయి.
సునీల్ మిట్టల్ మొత్తం ఆస్తుల విలువ
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో దక్షిణాసియాలో కంపెనీ ఆదాయం 30% కంటే ఎక్కువగా పెరిగిందని Haier కంపెనీ ఏప్రిల్ 29న ఫైలింగ్‌లో తెలియజేసింది. అదే సమయంలో కంపెనీకి సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లలో 21 శాతం వాటా ఉంది. Haier ఇండియా రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్లు ఇంకా ఎయిర్ కండిషనర్లు వంటి ఉత్పత్తులను విక్రయిస్తుంది. ఒక్క 2024 సంవత్సరంలో కంపెనీ అమ్మకాలు రూ. 8,900 కోట్లుగా ఉన్నాయి. : హయ్యర్ కంపెనీతో సునీల్ మిట్టల్ ఒప్పందం త్వరలో కొత్త మలుపు తీసుకోవచ్చు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, సునీల్ మిట్టల్ ఇంకా అతని కుటుంబం మొత్తం నికర ఆస్తుల విలువ 28 బిలియన్ డాలర్లు అంటే ఇండియా కరెన్సీ ప్రకారం 2.39 లక్షల కోట్లు.
Read Also: Russia – Ukraine : పుతిన్తో చర్చలకు సిద్ధం: జెలెన్ స్కీ