ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరింత వేడెక్కాయి,వల్లభనేని వంశీ అరెస్ట్ సమయంలోనే అటు దెందులూరు నియోజకవర్గం లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ నేత చింతమనేని,వైసీసీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మధ్య రాజకీయ పోరు తీవ్ర స్థాయికి చేరింది. ఈ సమయంలో చింతమనేని చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వ్యవహారం పైన సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే చింతమనేని పై సీరియస్ అయ్యారు. అధికారంలో ఉన్నామని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఒక వివాహ వేడుకకు హాజరైన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అక్కడ కారు అడ్డంగా ఉంచటం పైన అబ్బయ్య చౌదరి కారు డ్రైవరు పైన దుర్భాషలాడారు. దీంతో, అబ్బయ్య చౌదరి మద్దతుదారులు ఎమ్మెల్యే చింతమనేనిని వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఈ ఘటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీ కార్యాలయంలో సీఎం చంద్రబాబును చింతమనేని కలిసారు. తాజా ఘటన పైన చింతమనేని వివరణ ఇచ్చారు.

చింతమనేని రాజీనామా వ్యాఖ్యలు
చింతమనేని వివరణ విన్న చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. తప్పును తప్పని చెప్పడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేవలం బూతులు ఒక్కటే మార్గం కాదని, తీరు మార్చు కోవాలని చంద్రబాబు హెచ్చరించారు. ఇదే సమయంలో చింతమనేని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. దెందులూరు ఘర్షణలో తన తప్పు ఉందని రుజువైతే రాజీనామాకు సిద్ధమని ప్రనకటించారు. సుకన్య, సంజనల సర్దిఫికెట్ పొందిన అంబటి స్థాయి అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. నోరు ఉంది కదా అని ఆంబోతులా రంకెలు వేయటం ఇకనైనా మానుకో వాలని సూచించారు.
కోడెల శివప్రసాదరావు మృతి పై ఆరోపణలు
అంబటి రాంబాబు, వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కోడెల శివప్రసాదరావు మృతికి కారణమైన వారిపై కేసు పెట్టేందుకు సిద్ధం అని వెల్లడించారు.
అంబటి రాంబాబు, జగన్‌పై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
పోలవరం కాల్వ బాధితుల పరిష్కారం – 6 కోట్లుఎగ్గొట్టే కుట్ర
రూ. 6 కోట్లు ఎగ్గొట్టేందుకు కుట్రపన్నారని అబ్బయ్య చౌదరి వర్గాలపై ఆరోపణలు చేశారు.
తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు అసంతృప్తి – చింతమనేనికి గట్టి వార్నింగ్
ఈ వివాదం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది. అధికారంలో ఉన్నప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలని చంద్రబాబు చింతమనేనిని హెచ్చరించారు.పార్టీ కార్యాలయంలో చింతమనేని చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చారు. తప్పును తప్పని చెప్పడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని ,తీరు మార్చు కోవాలని చంద్రబాబు హెచ్చరించారు.