ఐపీఎల్ 2025 సీజన్‌లో, శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. పంజాబ్ నిర్దేశించిన 246 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 18.3 ఓవర్లలో 247/2 స్కోరు చేసింది. అభిషేక్‌శర్మ(55 బంతుల్లో 141, 14ఫోర్లు, 10 సిక్స్‌లు) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. అభిషేక్‌కు తోడు హెడ్(66) జత కలువడంతో రైజర్స్ గెలుపు నల్లేరుపై నడక అయ్యింది. అర్ష్‌దీప్‌సింగ్, చాహల్‌కు ఒక్కో వికెట్ దక్కింది. తొలుత శ్రేయాస్ అయ్యర్(36 బంతుల్లో 82, 6ఫోర్లు, 6సిక్స్‌లు) అర్ధసెంచరీతో పంజాబ్ 20 ఓవర్లలో 245/6 స్కోరు చేసింది. హర్షల్(4/42) నాలుగు వికెట్లు తీశాడు. అభిషేక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యుత్తమ ఛేదనగా హైదరాబాద్, పంజాబ్ పోరు నిలిచింది.
పంజాబ్ ఆల్‌రౌండర్
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించారు. తన ఐపీఎల్ కెరియర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో ఆరో ఫాస్టెస్ట్ సెంచరీ.ఇంతకు ముందు జానీ బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్ మధ్య 185 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇక పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 40 బంతుల్లోనే సెంచరీని నమోదు చేశాడు. ఐపీఎల్‌లో వేగంగా ఆరో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అలాగే, వేగంగా సెంచరీ చేసిన మూడో భారతీయ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. అలాగే ఈ ఐపీఎల్‌లో భారీ సిక్సర్ కొట్టిన బ్యాటర్‌గానూ రికార్డు సృష్టించాడు. పదో ఓవర్లో పంజాబ్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సన్ వేసిన బంతిని 106 మీటర్ల దూరం పంపి రికార్డు సృష్టించాడు. పంజాబ్‌పై అభిషేక్ 141 పరుగులు చేశాడు. బ్యాట్స్‌మన్ 256.36 స్ట్రయిక్ రేట్‌తో 14 ఫోర్లు, పది సిక్సర్లు బాదాడు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఆ తర్వాత 246 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ మరో ఐదు బంతుల మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోర్ ఛేజ్ చేయడం గమనార్హం.

బౌలింగ్
పంజాబ్ నిర్దేశించిన 246 పరుగుల భారీ లక్ష్యఛేదనలో హైదరాబాద్‌కు అభిషేక్ ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. హెడ్‌ను అండగా చేసుకుంటూ అభిషేక్ విధ్వంస రచనకు శ్రీకారం చుట్టాడు. నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టొయినిస్ ఇచ్చిన లైఫ్‌ను వినియోగించుకున్న శర్మ యాన్సెన్‌ను హ్యాట్రిక్ ఫోర్లతో అరుసుకున్నాడు. పొదుపుగా బౌలింగ్ చేసే అర్ష్‌దీప్‌సింగ్‌ను లక్ష్యంగా చేసుకున్న హెడ్ మూడు ఫోర్లు కొట్టడంతో మూడో ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. ఓవైపు అభిషేక్, మరోవైపు హెడ్ దంచుడుతో పంజాబ్ బౌలర్లు చేష్టలుడిగిపోయారు. వీరి జోరుకు అడ్డుకట్ట వేసేందుకు పంజాబ్ కెప్టెన్ అయ్యర్ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. 20 బంతుల్లో అర్ధసెంచరీ అందుకున్న అభిషేక్ లక్ష్యాన్ని అంతకంతకూ కరిగించుకుంటూ పోయాడు. దూకుడు ప్రదర్శించిన అభిషేక్ మరో 20 బంతుల్లో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. 100 పరుగులకు చేరుకోగానే తన జేబులో నుంచి చిట్టి తీస్తూ సంబురాలు చేసుకున్నాడు. హెడ్ ఔటైనా ఎక్కడా జోరు తగ్గించని శర్మతన కెరీర్‌లో అత్యుత్తమ స్కోరు అందుకుని అర్ష్‌దీప్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆఖర్లో క్లాసెన్(21 నాటౌట్), ఇషాన్‌కిషన్(9 నాటౌట్) మరో 9 బంతులు మిగిలుండగానే గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు.
Read Also: IPL 2025:గుజరాత్ టైటాన్స్‌పై లక్నో ఘన విజయం