A tiger cub is a tiger cub.. YS Sharmila sensational tweet

YS Sharmila : పులి బిడ్డ పులిబిడ్డే.. వైఎస్‌ షర్మిల సంచలన ట్వీట్

YS Sharmila : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘వైసీపీకి, ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చ కామెర్ల రోగం తగ్గినట్లు లేదు. కళ్ళకు కమ్మిన పసుపు బైర్లు తొలగినట్లు లేదు. ఇప్పటికీ అద్దంలో మొహం చూసుకున్నా చంద్రబాబు కనిపించడం చాలా బాధాకరం. ఏది చేసినా అర్థం, పరమార్థం టీడీపీ అనడం వారి వెర్రితనానికి నిదర్శనం.

Advertisements
పులి బిడ్డ పులిబిడ్డే వైఎస్‌

అసత్యాలు వల్లె వేయడం మానుకోలేదు.

స్వయంశక్తితో ఎదుగుతుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుంటే, ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజల్లో ముద్ర వేసుకుంటుంటే, చూసి ఓర్వలేక, అసత్యపు ఆరోపణలతో నిందలు వేయడం మీ చేతకానితనానికి నిదర్శనం. 11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చినా.. మీ నీచపు చేష్టలు మారలేదు. అసత్యాలు వల్లె వేయడం మానుకోలేదు. నిజాలు జీర్ణించుకోలేని మీరు.. ఇక ఈ జన్మకు మారరు అని రాష్ట్ర ప్రజలకు మరోసారి అర్థం అయ్యింది అంటూ ఘాటుగా పేర్కొన్నారు. ఇంతకాలం ఎవరి సేవలో ఎవరు తరించారో అందరికీ తెలుసు. ఎవరికి ఎవరు దత్తపుత్రుడుగా ఉన్నారో తెలుసు.

పులి బిడ్డ పులిబిడ్డే

తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచి, రాష్ట్ర ప్రయోజనాలను మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి.. స్వలాభమే పరమావధిగా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు. ప్యాలెస్‌లు కట్టుకున్నారు. రుషికొండను కబ్జా చేయాలని చూశారు. మొత్తంగా మోడీ దోస్తులకు రాష్ట్రాన్ని దోచి పెట్టారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టే ప్రతి అంశంలో మోడీకి మద్దతుగా నిలిచి 5 ఏళ్ల పాటు మోదానీ సేవలో తరించినట్లు ప్రజలకు సర్వం బోధపడింది అని షర్మిల రెచ్చిపోయారు. ‘ఎవరో ఒకరి సేవలో తరించాల్సిన ఖర్మ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డికి పట్టలేదు. పులి బిడ్డ పులిబిడ్డే. ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్.. అన్ని పార్టీలు బీజేపీకి గులాంగిరి చేసేవే.. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతిపక్షంగా ఒంటరి పోరాటం చేస్తుందని షర్మిల అన్నారు.

Read Also: అమరావతిలో గ్లోబల్‌ మెడ్‌సిటీ : సీఎం చంద్రబాబు

Related Posts
Revanth Ready : పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదు
Revanth Ready : పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదు

పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేలకు హెచ్చరిక జారీ చేశారు. పార్టీ గీత దాటితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది Read more

నేడు ప్రధానితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
CM Revanth Reddy meet the Prime Minister today

మోడీ అపాయింట్‌మెంట్‌ కోరిన రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం 10.30కు ప్రధాని మోడీని కలవనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్‌ సమాచారం రావడంతో ఆయన Read more

హైకోర్టు లో పేర్ని నానికి ఊరట
హైకోర్టు లో పేర్ని నానికి ఊరట

ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని రేషన్ బియ్యం మాయం కేసులో ఆరో నిందితుడిగా (A6) చేర్చబడ్డారు. ఈ కేసులో మొదటి నిందితురాలిగా Read more

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్
Airindia offer

విమాన ప్రయాణికులకు శుభవార్త! ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ కొత్త ‘పేడే సేల్’ ద్వారా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×