టెక్ దిగ్గజాలు మార్క్ జుకర్‌బర్గ్ అండ్ స్టీవ్ జాబ్స్ వ్యక్తిగత వస్తువులు తాజాగా అమ్మకానికి రావడం కలకలం సృష్టిస్తోంది. వీరి ఉపయోగించిన బట్టలు, ఉత్తరాలు అన్నీ లక్షలకు వేలం అయ్యాయి. ఇటీవల జరిగిన ఓ వేలంలో ఏయే వస్తువులు అమ్ముడయ్యాయో వివరాలను చూస్తే… 2019లో ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తరచుగా ధరించే నల్లటి హూడీ లాస్ ఏంజిల్స్‌లో జరిగిన వేలంలో $15,875 కు అమ్ముడైంది. అంటే భారత కరెన్సీలో 14 లక్షల రూపాయలు. ఈ దుస్తులు “ఆల్టర్నేటివ్” బ్రాండ్ కు చెందినవి. 2010లో మార్క్ జుకర్‌బర్గ్‌ను టైమ్ మ్యాగజైన్ “పర్సన్ ఆఫ్ ది ఇయర్”గా సెలెక్ట్ చేసింది. ఆ సమయంలో అతను ఈ దుస్తులను తరచుగా ధరించేవాడు.

ఇది నాకు ఇష్టమైన..
న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, మార్క్ జుకర్‌బర్గ్ ఆ దుస్తుల కొత్త యజమానికి చేతితో రాసిన ఒక నోట్‌ను కూడా పంపాడు, అతను దానిని వేలం ద్వారా గెలుచుకున్నాడు. “ఇది నాకు ఇష్టమైన పాత ఫేస్‌బుక్ హూడీలలో ఒకటి. తొలినాళ్లలో నేను దీన్ని తరచుగా ధరించేవాడిని” అని అంటూ రాశారు.
వేలంలో అమ్ముడైన ఇతర ప్రసిద్ధ వస్తువులలో స్టీవ్ జాబ్స్ ధరించిన సిగ్నేచర్ బో టై కూడా ఉంది. సూట్ వేసుకుంటూ బో టై వేసుకునే చాలా మందిని మీరు బహుశా చూసి ఉంటారు. దీనిని వేలం $35,750 పలికింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 31 కోట్లు. ఇది అతను కొన్న $1,000 కంటే 35 రెట్లు ఎక్కువ.
చరిత్ర సృష్టించిన స్టీవ్ జాబ్స్ లేఖ
ఈ బౌ టైను స్టీవ్ జాబ్స్ 1984 అండ్ 1983లో అనేక కార్యక్రమాలలో ధరించారని నివేదికలు సూచిస్తున్నాయి. అదనంగా కుంభమేళా ప్రణాళికకు సంబంధించిన స్టీవ్ జాబ్స్ లేఖ రూ. 4.32 కోట్లకు అమ్ముడైంది. ఇది స్టీవ్ జాబ్స్ చేతితో రాసిన లేఖ.