బిడ్డకు జన్మనిచ్చి మరణించిన మైనర్‌ బాలిక

బిడ్డకు జన్మనిచ్చి మరణించిన మైనర్‌ బాలిక

చిత్తూరు జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిడ్డకు జన్మనిచ్చి మరణించిన మైనర్‌ బాలిక.పలమనేరు మండలం టి ఒడ్డురు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని గర్భవతి అయింది. విషయం తెలిసిన ఉపాధ్యాయులు ఆమెను ఇంటికి పంపారు. మైనర్ బాలిక ఇంటికి వచ్చిన తర్వాత ఫిట్స్ రావడంతో ఆసుపత్రికి తరలించారు. బాలిక రుయా ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు విడిచింది. దీంతో బాలిక తల్లిదండ్రులు తమ బిడ్డను గర్భవతిని చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

బిడ్డకు జన్మనిచ్చి మరణించిన మైనర్‌ బాలిక
బిడ్డకు జన్మనిచ్చి మరణించిన మైనర్‌ బాలిక

బిడ్డను కని ప్రాణాలు విడిచిన విద్యార్ధిని

పలమనేరు మండలంలోని టి ఒడ్డురు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలిక గర్భవతి అయినట్లు గుర్తించిన ఉపాధ్యాయులు తల్లితండ్రులకు సమాచారం ఇచ్చారు. గర్భవతిని అయిన మైనర్ బాలికను ఇంటికి పంపారు ఉపాధ్యాయులు. అయితే బాలిక లావుగా ఉండటంతో గర్భం దాల్చినట్లుగా గుర్తించలేకపోయారు తల్లిదండ్రులు. ఇంటి దగ్గరే ఫిట్స్ రావడంతో వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


పోక్సో చట్టం కింద కేసు
అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు తల్లిదండ్రులు. చికిత్స అందిస్తుండగానే బిడ్డకు జన్మనిచ్చి బాలిక ప్రాణాలు విడిచింది. ఇప్పుడు ఈవార్త జిల్లాలో సంచలనంగా మారింది. అయితే తమ బిడ్డ గర్భవతి అయిన విషయాన్ని మాకు చెప్పలేదని ..ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత తెలిసిందని తల్లిదండ్రులు వాపోయారు. స్కూల్‌లో చదువుతున్న బాలికపై ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన వాళ్లను పట్టుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

దారుణ ఘటనపై పోలీసుల స్పందన

ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. బాలిక గర్భవతిగా మారడానికి కారణమైన వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నారు. ఈ కేసును తీవ్రంగా తీసుకున్న పోలీస్ అధికారులు, బాలిక కుటుంబ సభ్యుల నుండి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులను కూడా విచారించి, బాలిక గర్భవతి అయిన విషయాన్ని ఎందుకు ముందుగా అధికారులకు తెలియజేయలేదనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.

సమాజంలో పెరుగుతున్న మైనర్‌ గర్భధారణ కేసులు

ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో తరచూ నమోదవుతున్నాయి. బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు, విద్యాసంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మైనర్ బాలికల భద్రత కోసం పాఠశాలల్లో కఠిన నిబంధనలు అమలు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ప్రత్యేకంగా బాలికలకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు.

తల్లిదండ్రుల ఆవేదన

తమ కూతురు కనీసం జీవితాన్ని ఆస్వాదించకుండానే ఇంతటి ఘోరానికి గురైందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిందితుడిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి దుర్మార్గులకి కఠిన శిక్షలు విధించాలనే డిమాండ్ చేస్తున్నారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదని వారు చెబుతున్నారు.

ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థానికి విజ్ఞప్తి

ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వాలు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై త్వరితగతిన న్యాయపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు.

Related Posts
ఏపీలో మరో హైటెక్ సిటీకి చంద్రబాబు సన్నాహాలు?
chandra babu

ఒకప్పుడు హైదరాబాద్ నగరాన్ని ఐటీ కంపెనీలకు కేంద్ర బిందువుగా మారటానికి సీఎం చంద్రబాబు చేసిన కృషి సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఏపీ-తెలంగాణ విడిపోయిన తర్వాత Read more

పోలీసుల‌కు మోహ‌న్ బాబు గ‌న్ అప్ప‌గింత
mohan

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు త‌న లైసెన్స్ గ‌న్‌ను పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈరోజు హైద‌రాబాద్ నుంచి ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి మండ‌లం రంగంపేట‌లోని త‌న Read more

సైబర్ ఉచ్చులో పడి నగదు కోల్పోయిన మహిళ
Cyber Crime

సైబర్ ఉచ్చులో పడి నగదు కోల్పోయిన మహిళ .మహిళా ఖాతానుండి 17 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు.తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దనలక్ష్మీనగర్ లోచోటు చేసుకున్న Read more

తొలిసారి ఏపీలో ‘కొకైన్’ కలకలం
Three arrested and 8.5 gram

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గంజాయి తో తదితర వంటిమాదక ద్రవ్యాలు పెద్దగా కనిపిస్తున్నా, కొకైన్ వంటి అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యం మాత్రం ఇంతవరకు కనిపించలేదు. Read more