हिन्दी | Epaper

Telangana weather alert : తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక

Sai Kiran
Telangana weather alert : తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక

Telangana weather alert : తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేటి నుంచి రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఈ అకాల వర్షాలు పడుతున్నాయని అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్, గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని హెచ్చరించారు.

Read Also: Swarna Grama Ward Sachivalayam: సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే

Telangana weather alert
Telangana weather alert

హైదరాబాద్‌లో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్ష సూచనలు ఉండగా, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870