నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సర్వీసెస్ (NBEMS), 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (MDS) కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ ఎండీఎస్ (NEET MDS) 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ డెంటల్ కళాశాలల్లో పీజీ సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష ప్రాతిపదికగా ఉంటుంది. ఈ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా ఓరల్ సర్జరీ, ఆర్థోడాంటిక్స్, పీరియాడాంటాలజీ వంటి వివిధ స్పెషలైజేషన్‌లలో అభ్యర్థులు ప్రవేశం పొందవచ్చు.
Read Also: GATE 2026 Results: మరో రెండు రోజుల్లో గేట్ ఫలితాలు విడుదల!

ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS) పూర్తి చేసి ఉండాలి. డిగ్రీతో పాటు తప్పనిసరిగా 12 నెలల రోటేటరీ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. ప్రస్తుతం ఇంటర్న్‌షిప్ చేస్తున్న అభ్యర్థులు మే 31, 2026 నాటికి దానిని పూర్తి చేసేలా ఉండాలి. వీటితో పాటు సంబంధిత స్టేట్ డెంటల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండటం ఆవశ్యకం. అర్హులైన అభ్యర్థులు మార్చి 14 నుండి మార్చి 30, 2026 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
మే 2న దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష
నీట్ ఎండీఎస్ రాత పరీక్షను మే 2, 2026న దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా ఓరల్ మెడిసిన్, రేడియాలజీ, పెడోడాంటిక్స్, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు ఏప్రిల్ 29 నుండి తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలను జూన్ 2, 2026 లోపు విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: