हिन्दी | Epaper

Jagtial Crime: కుక్కకాటుతో బాలుడి మృతి

Aanusha
Jagtial Crime: కుక్కకాటుతో బాలుడి మృతి

Jagtial Crime: జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల గ్రామంలో అత్యంత బాధాకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కుక్కకాటుకు గురైన ఓ చిన్నారి, దాదాపు 15 నెలల పాటు మృత్యువుతో పోరాడి చివరకు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తల్లిదండ్రులు ఎంత ఖర్చు చేసినా, ఎన్ని వైద్యాలు అందించినా ఆ బాలుడి ప్రాణాలు మాత్రం దక్కలేదు.

Read Also: Actress Pratyusha Case: ప్రత్యూష కేసులో కీలక మలుపు: నాంపల్లి కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థరెడ్డి

ఘటన నేపథ్యం

వివరాల్లోకి వెళితే.. కోటిలింగాలకు చెందిన మంచికట్ల శ్రీనివాస్‌-మాధవి దంపతులకు కుమారుడు మణితేజ, కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్‌ హైదరాబాద్‌ నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నారు. 2024 డిసెంబరు 26న సమీప బంధువుల వివాహం ఉండగా స్వగ్రామానికి వచ్చారు.అందరూ పెళ్లి వేడుకల్లో బిజీగా ఉండగా.. ఆరు బయట తోటి చిన్నారులతో ఆడుకుంటుండగా మణితేజ ఎడమవైపు మెడ, భుజం మధ్య భాగంలో కుక్క కరిచింది. దీంతో మణితేజను వెంటనే సమీపంలోని హాస్పిటల్ తరలించి రేబిస్ టీకా ఇప్పించారు. ఆ తర్వాత 20 రోజులకు సంక్రాంతి సెలవులకు మళ్లీ ఇంటికి వచ్చిన తర్వాత మణితేజకు అకస్మాత్తుగా ఉన్నట్లుండి జ్వరం వచ్చింది.

Jagtial Crime: Boy dies from dog bite
Jagtial Crime: Boy dies from dog bite

చికిత్స కోసం వెంటనే జగిత్యాలలోని ప్రవేటు హాస్పిటల్ తీసుకెళ్లగా శ్వాస ఇబ్బందిగా మారింది. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. వెన్నెముక నుంచి మెదడుకు వెళ్లే నరం దెబ్బతిన్నట్లు అక్కడి డాక్టర్లు వెల్లడించారు. ఆ రోజు నుంచి పూర్తిగా వెంటిలేటర్‌పైనే మణితేజకు చికిత్స అందించారు. కొడుకు ప్రాణాన్ని కాపాడుకునేందుకు శ్రీనివాస్ స్తోమతకు మించి రూ.50 లక్షలకుపైగా ఖర్చు చేశాడు. అయినా బాలుడి ప్రాణం దక్కలేదు. దాంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి

కాగా, కుక్క కరిచిన వెంటనే ఆ గాయాన్ని కనీసం 15 నిమిషాల పాటు ప్రవహించే నీటి కింద పెట్టి సబ్బుతో బాగా రుద్ది కడగాలని డాక్టర్లు చెబుతున్నారు. దీనివల్ల వైరస్ లోడ్ చాలా వరకు తగ్గుతుందని అంటున్నారు. గాయం చిన్నదైనా, పెద్దదైనా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించి వ్యాక్సిన్ తీసుకోవాలని అంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870