हिन्दी | Epaper

SRH Captain : IPL 2026లో SRH కెప్టెన్సీపై పెద్ద ట్విస్ట్

Sai Kiran
SRH Captain : IPL 2026లో SRH కెప్టెన్సీపై పెద్ద ట్విస్ట్

SRH Captain : ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు షాకింగ్ న్యూస్ వైరల్‌గా మారింది. జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ గాయం కారణంగా మొదటి కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం.

ఈ పరిస్థితుల్లో SRH జట్టుకు కొత్త కెప్టెన్‌గా యువ ఆటగాడు అభిషేక్ శర్మ పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు టాక్ జోరుగా వినిపిస్తోంది.

కమ్మిన్స్ ఫిట్‌నెస్ సందేహం

SRH జట్టు ఈసారి బలమైన స్క్వాడ్‌తో బరిలోకి దిగుతోంది. టాప్ ప్లేయర్స్ అందరూ అందుబాటులో ఉండటంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అయితే కెప్టెన్ పాట్ కమ్మిన్స్ వెన్ను నొప్పి కారణంగా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని తెలుస్తోంది. గతంలో కూడా యాషెస్ సిరీస్ సమయంలో గాయం కారణంగా అతడు మధ్యలోనే దూరమయ్యాడు.

ప్రస్తుతం కోలుకుంటున్నప్పటికీ IPL ప్రారంభానికి పూర్తిగా సిద్ధమవుతాడా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు.

అభిషేక్ శర్మకు ఛాన్స్?

ఒకవేళ కమ్మిన్స్ అందుబాటులో లేకపోతే అభిషేక్ శర్మను కెప్టెన్‌గా నియమించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. జట్టు మేనేజ్‌మెంట్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అభిషేక్ శర్మ ఇటీవలి మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శనతో జట్టులో కీలక ప్లేయర్‌గా మారాడు. దీంతో అతనిపై నమ్మకం పెరిగినట్లు తెలుస్తోంది.

Read Also: Gold rate 16/03/26 : ఈరోజు బంగారం ధరలు, హైదరాబాద్‌లో ఎంతంటే?

SRH Captain
SRH Captain

ఇషాన్ కిషన్ పేరు కూడా రేసులో

అభిషేక్ శర్మతో పాటు మరో పేరు కూడా బలంగా వినిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్‌లో విధ్వంసకర బ్యాటింగ్ చేసిన ఇషాన్ కిషన్‌ను కూడా కెప్టెన్సీకి పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

చివరికి SRH మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

SRH మ్యాచ్ షెడ్యూల్

BCCI ఇప్పటికే IPL 2026కు సంబంధించి తొలి దశ షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో భాగంగా SRH జట్టు మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్ ఆడనుంది.

మార్చి 28 – సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – బెంగళూరు
ఏప్రిల్ 2 – సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ – కోల్‌కతా
ఏప్రిల్ 5 – సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ – హైదరాబాద్
ఏప్రిల్ 11 – సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ – న్యూ చండీగఢ్

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఐపీఎల్ పాత జ్ఞాపకాలను పంచుకున్న అంబటి రాయుడు

ఐపీఎల్ పాత జ్ఞాపకాలను పంచుకున్న అంబటి రాయుడు

ఇది స్వ్కాడ్ కాదు.. కావ్యపాప ఖతర్నాక్ బ్యాచ్

ఇది స్వ్కాడ్ కాదు.. కావ్యపాప ఖతర్నాక్ బ్యాచ్

సీఎస్‌కేలో సంజు శాంసన్ విధ్వంసం

సీఎస్‌కేలో సంజు శాంసన్ విధ్వంసం

IPL 2026లో SRH కెప్టెన్సీపై పెద్ద ట్విస్ట్

IPL 2026లో SRH కెప్టెన్సీపై పెద్ద ట్విస్ట్

క్రిస్ గేల్ రికార్డుపై కన్నేసిన వైభవ్

క్రిస్ గేల్ రికార్డుపై కన్నేసిన వైభవ్

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు గ్రీన్ సిగ్నల్!

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు గ్రీన్ సిగ్నల్!

ధోని రిటైర్మెంట్‌ పై ఉతప్ప ఏమంటున్నారు?

ధోని రిటైర్మెంట్‌ పై ఉతప్ప ఏమంటున్నారు?

పాక్ విండీస్ సిరీస్ ఎఫెక్ట్.. ది హండ్రెడ్ టోర్నీకి అబ్రార్ దూరం?

పాక్ విండీస్ సిరీస్ ఎఫెక్ట్.. ది హండ్రెడ్ టోర్నీకి అబ్రార్ దూరం?

సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లో లోపాలు.. ఆ ముగ్గురు అవుటైతే అంతేనా?

సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లో లోపాలు.. ఆ ముగ్గురు అవుటైతే అంతేనా?

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

పాకిస్థాన్ లీగ్‌ను కాదన్న ముజరబానీపై పీసీబీ ఫైర్?

పాకిస్థాన్ లీగ్‌ను కాదన్న ముజరబానీపై పీసీబీ ఫైర్?

📢 For Advertisement Booking: 98481 12870