हिन्दी | Epaper

Donald Trump: నాటో దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.

Saritha
Donald Trump: నాటో దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.

Donald Trump: హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచే విషయంలో అమెరికాకు మిత్రదేశాలు సాయం చేయకపోతే నాటో భవిష్యత్తు ‘చాలా దారుణంగా’ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ అడ్డంకుల వల్ల మూతపడిన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు తమతో కలిసి రావాలని నాటో కూటమిని ఆయన డిమాండ్ చేశారు. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం, ఆదివారం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ జలసంధి ద్వారా యూరప్ దేశాలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నాయని, కాబట్టి అక్కడి భద్రతకు వాళ్లు కూడా బాధ్యత వహించాలని ట్రంప్ స్పష్టం చేశారు. 

Read Also: Iran-Israel war: ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అధ్యక్షుడి విమానం ధ్వంసం

Donald Trump: నాటో దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.
Donald Trump: Trump Issues Strong Warning to NATO Countries.

నాటో కూటమిలో మొదలైన కలకలం

హర్మూజ్ జలసంధి ద్వారా చమురు పొందుతున్న దేశాలు తమ సొంత నౌకల రక్షణ కోసం ముందుకు రాకపోవడాన్ని ట్రంప్ తప్పుబట్టారు. అందరి కోసం అమెరికా ఒక్కటే కాపలా కాయలేదు. ఈ కీలక మార్గాన్ని తెరిపించేందుకు జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ యుద్ధనౌకలను పంపించాలి.

నాటో దేశాలు తమ బాధ్యతను నెరవేర్చకుంటే ఆ కూటమి భవిష్యత్తు ప్రశ్నార్థకమే అని ఆయన హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలతో నాటో కూటమిలో ఒక్కసారిగా కలకలం రేగింది. పశ్చిమాసియా యుద్ధంలో నేరుగా పాల్గొనడానికి యూరోపియన్ దేశాలు మొగ్గు చూపకపోవడంతో, అమెరికా, దాని మిత్రదేశాల మధ్య దూరం పెరుగుతోందనే చర్చ మొదలైంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870