हिन्दी | Epaper

West Bengal: పశ్చిమ బెంగాల్‌ సీఎస్‌పై ఈసీ వేటు- డీజీపీ బదిలీ

Vanipushpa
West Bengal: పశ్చిమ బెంగాల్‌ సీఎస్‌పై ఈసీ వేటు- డీజీపీ బదిలీ

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులు చేపట్టింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వంలోని పలువురు కీలక సీనియర్ అధికారులను పదవుల నుంచి తప్పిస్తూ కొత్త నియామకాలు ప్రకటించింది. స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

Read Also: Indians Arrested in UAE: యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

West Bengal: EC suspends West Bengal CS, DGP transferred
West Bengal: EC suspends West Bengal CS, DGP transferred

ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష అనంతరం బదిలీ

మార్చి 15 తేదీన కోల్‌కతాలోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం ఒక లేఖ పంపింది. ఆ లేఖలో బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన అనంతరం, ఆ బదిలీలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఆదేశాల ప్రకారం 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి దుష్యంత్ నరియాలాను రాష్ట్ర ప్రభుత్వ కొత్త చీఫ్ సెక్రటరీగా నియమించాలని తెలిపింది. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న నందిని చక్రబర్తిని ఆ పదవి నుంచి తప్పించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆమెను ఎలాంటి ఎన్నికలకు సంబంధించిన బాధ్యతల్లోనూ నియమించకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అదే విధంగా మరో కీలక మార్పుగా 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంగమిత్ర ఘోష్‌ను రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. ఈ నియామకాలు వెంటనే అమలులోకి తీసుకురావాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల సంఘం కార్యదర్శి సుజీత్ కుమార్ మిశ్రా సంతకంతో జారీ చేసిన ఆదేశాల్లో ఈ మార్పులను వెంటనే అమలు చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870