
TS Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజే శాసనసభ ప్రాంగణం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామాల్లో తాము చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో మాజీ సర్పంచులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో తరలివచ్చిన మాజీ సర్పంచులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసెంబ్లీ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.
Read Also:TG Assembly Sessions: ఆరు గ్యారంటీలు ఎక్కడ? ప్రభుత్వాన్ని ఎండగడతామన్న మహేశ్వర్‌రెడ్డి.
అసెంబ్లీ వద్ద హైటెన్షన్.. సర్పంచుల అరెస్ట్
సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు ముందస్తుగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ముట్టడికి యత్నించిన జేఏసీ నాయకులను, మాజీ సర్పంచులను పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యతో నిరసనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య తోపులాట జరగడంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. అరెస్టు చేసిన వారిని బలవంతంగా వాహనాల్లో ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

తమ సొంత డబ్బులు వెచ్చించి గ్రామాల్లో పనులు పూర్తి చేశామని, ఏళ్ల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థికంగా చితికిపోతున్నామని మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నుంచి ప్రస్తుత ప్రభుత్వం వరకు పెండింగ్ బిల్లుల విషయంలో తమను మోసం చేస్తున్నాయని వారు మండిపడ్డారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా తమ సమస్యలపై స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: