हिन्दी | Epaper

Anganwadi Timings: అంగన్వాడీల్లోనూ ఒంటిపూట బడులు!

Tejaswini Y
Anganwadi Timings: అంగన్వాడీల్లోనూ ఒంటిపూట బడులు!

Anganwadi Timings: రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాలను కూడా ఒంటిపూట మాత్రమే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా పాఠశాల విద్యాశాఖ మార్చి 16 నుంచి ఒంటిపూట బడులను అమలు చేస్తోంది. అదే తరహాలో అంగన్వాడీలు కూడా ఇకపై ఉదయం వేళల్లోనే పనిచేయనున్నాయి.

Read Also:TN Elections 2026: విజయ్‌కు బీజేపీ బంపర్ ఆఫర్.. 80 సీట్లు, డిప్యూటీ సీఎం పదవి?

Anganwadi Timings: Same-day classes in Anganwadis too!
Anganwadi Timings: Same-day classes in Anganwadis too!

ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 23 వరకు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. మండుతున్న ఎండల కారణంగా మధ్యాహ్నం వేళ చిన్నారులు ఇంటికి వెళ్లడం ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఏప్రిల్ 23 తర్వాత వేసవి తీవ్రతను బట్టి సుమారు నెలరోజులపాటు వేసవి సెలవులను ప్రకటించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై మరికొన్ని రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలు అవకాశం ఉంది. అయితే సెలవులు ప్రకటించినా చిన్నారులు గర్భిణులకు అందాల్సిన పౌష్టికా హారంజ ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రభుత జాగ్రత్తలు తీసుకుంటోంది. అంగన్వాడీ కేంద్రాలు వచ్చి భోజనం చేయలేని వారికి టేక్ హోమ్ రే పద్ధతిలో నేరుగా వారి ఇళ్లకే రేషనన్ను చేరవే ప్రక్రియను మరింత పటిష్టం చేయనున్నాడా తద్వారా వేసవిలో కూడా పౌష్టికాహార పంపి నిరంతరాయంగా కొనసాగుతుందని అధికారు. తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870