हिन्दी | Epaper

Assam elections 2026 : కాంగ్రెస్ మరో జాబితా, అసోంలో 23 మంది అభ్యర్థులు

Sai Kiran
Assam elections 2026 : కాంగ్రెస్ మరో జాబితా, అసోంలో 23 మంది అభ్యర్థులు

Assam elections 2026 : త్వరలో జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాలను వరుసగా విడుదల చేస్తోంది. ఇప్పటికే మొదటి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ తాజాగా 23 మందితో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 65కి చేరింది.

ఈ రెండో జాబితాను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. గతంలో ప్రకటించిన మొదటి జాబితాలో 42 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి.

రెండో జాబితాలో పార్టీ సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇచ్చారు. వీరిలో మాజీ ఎంపీ అబ్దుల్ ఖాలీక్‌కు కొత్తగా ఏర్పడిన మండియా నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చారు.

అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాజెద్ అలీ చౌదరి (బిర్సింగ్ జరువా), అబుల్ కలాం రషీద్ ఆలం (గోల్‌పారా ఈస్ట్), రకీబుద్దీన్ అహ్మద్ (చమారియా)లకు మరోసారి అవకాశం కల్పించారు.

ఇవారితో పాటు బిపుల్ గోగోయ్ (టింగ్ఖోంగ్), శంతను బోరా (న్యూ గువహటి), నూరుల్ ఇస్లాం (సృజన్‌గ్రామ్) వంటి నేతలకు కూడా ఈ జాబితాలో చోటు కల్పించారు.

అసోం అసెంబ్లీలో మొత్తం 126 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఈసారి కూడా ఎన్డీఏ కూటమి మరియు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also: Siddipet Retired Employees Protest: సిద్దిపేటలో రిటైర్డ్ ఉద్యోగుల గర్జన..మద్దతు తెలిపిన హరీష్ రావు.

Assam elections 2026
Assam elections 2026

మొదటి జాబితాలో అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గోగోయ్ (జోర్హాట్), ప్రతిపక్ష నాయకుడు దేబబ్రత సైకియా (నజీరా) వంటి ప్రముఖ నేతల పేర్లను పార్టీ ప్రకటించింది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తన మిత్రపక్షాలకు కూడా 15 స్థానాలను కేటాయించింది. వీటిలో సీపీఐ(ఎం), అసోం జాతీయ పరిషత్ (AJP) వంటి పార్టీలు పోటీ చేసే అవకాశం ఉంది.

రాయ్జోర్ దళ్ పార్టీతో సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో ఆ పార్టీ కూటమి నుంచి విడిపోయి స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించింది.

గతంలో అసోంలో వరుస విజయాలతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 2016 నుంచి అధికారానికి దూరంగా ఉంది. ఈసారి ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

బెంగళూరులో యువతికి నైతిక పాఠాలు.. పొట్టి దుస్తులపై వృద్ధురాలు ఫైర్!

బెంగళూరులో యువతికి నైతిక పాఠాలు.. పొట్టి దుస్తులపై వృద్ధురాలు ఫైర్!

గ్యాస్ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేయాల్సిందే..కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్

గ్యాస్ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేయాల్సిందే..కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

రాజ్‌కోట్ ఎయిమ్స్ విద్యార్థి ఆత్మహత్య.. ఐదుగురు మెడికోల అరెస్ట్!

రాజ్‌కోట్ ఎయిమ్స్ విద్యార్థి ఆత్మహత్య.. ఐదుగురు మెడికోల అరెస్ట్!

కట్టుకున్న భర్తను మరో మహిళకు ‘లీజు’

కట్టుకున్న భర్తను మరో మహిళకు ‘లీజు’

నేడు సీఎం నితీశ్ కుమార్ రాజీనామా?

నేడు సీఎం నితీశ్ కుమార్ రాజీనామా?

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

పదమూడేళ్ల నరకానికి తెర.. హరీశ్‌కు కన్నీటి వీడ్కోలు

పదమూడేళ్ల నరకానికి తెర.. హరీశ్‌కు కన్నీటి వీడ్కోలు

ఒడిశా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, ఐసీయూలో 10 మంది మృతి

ఒడిశా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, ఐసీయూలో 10 మంది మృతి

📢 For Advertisement Booking: 98481 12870