हिन्दी | Epaper

Ustaad Bhagat Singh Trailer Release: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

Aanusha
'Ustaad Bhagat Singh' trailer is out
‘Ustaad Bhagat Singh’ trailer is out

Ustaad Bhagat Singh Trailer Release: మెగా అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేట్రికల్ ట్రైలర్‌ను శనివారం సాయంత్రం చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్‌గా విడుదల చేసింది. ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

Read Also: Vairamuthu: తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

“ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం”

ట్రైలర్ మొత్తం పవన్ కల్యాణ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో సాగింది. ముఖ్యంగా “ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం” అనే డైలాగ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. హరీశ్ శంకర్ మార్కు టేకింగ్, దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా స్కై హైకి తీసుకెళ్లాయి. పవన్ మ్యానరిజం, పోలీస్ ఆఫీసర్‌గా ఆయన చూపించిన స్వైగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. తొలి 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 అదనంగా వసూలు చేసుకోవచ్చు. అలాగే, మార్చి 19న తెల్లవారుజామున 4 లేదా 5 గంటల నుంచి బెనిఫిట్ షోలు ప్రదర్శించుకోవడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాటలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, నేపథ్య సంగీతాన్ని (బీజీఎం) తమన్ సమకూర్చడం విశేషం. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870