हिन्दी | Epaper

Iran War: యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

Vanipushpa
Iran War: యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

గల్ఫ్‌ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. శనివారం దుబాయ్, బహ్రెయిన్ సహా పలు దేశాలపై దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో పోర్టులకు దూరంగా ఉండాలని యూఏఈ వాసులను ఇరాన్(Iran) హెచ్చరించింది. ఈ పోర్టులకు సమీపంలో దాడులకు దిగుతామని తెలిపింది. ఇక్కడి రహస్య మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా దాడి చేస్తామని హెచ్చరించింది. ఇకపై యుద్ధంలో ప్రమాదకర బాలిస్టిక్ మిస్సైల్స్ ఉపయోగిస్తామని వెల్లడించింది.

Read Also: Attack: అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

Iran War: Iran warning to UAE residents
Iran War: Iran warning to UAE residents

యుద్ధం ముగిసేవరకు పోరాటం

అలాగే మరింత ప్రభావవంతమైన ఆయుధాల్ని కూడా వినియోగించబోతున్నామని, అవి భారీ విధ్వంసం సృష్టిస్తాయని ఇరాన్ తెలిపింది. ఈ యుద్ధాన్ని అమెరికాయే మొదలుపెట్టింది, తమను తాము రక్షించుకునేందుకు సిద్ధమని ఇరాన్ మరోసారి ప్రకటించింది. ఇండియాలోని ఇరాన్ ప్రతినిధి డా.అబ్దుల్ మాజిద్ మాట్లాడుతూ తాము దేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతామన్నారు. శతృవుల ముందు లొంగిపోబోమని, యుద్ధం ముగిసేవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల విషయంలో ముస్లిం దేశాలన్నీ ఒక్కటి కావాలని ఇరాన్ సైనిక దళాల ప్రతినిధి, బ్రిగేడియర్ జనరల్ అబాల్ఫజ్ షెకార్చి కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870