हिन्दी | Epaper

IPL 2026: వినూత్నంగా కేకేఆర్ జెర్సీ

Anusha
IPL 2026: వినూత్నంగా కేకేఆర్ జెర్సీ

IPL 2026: మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఈ సీజన్ కోసం అత్యంత వినూత్నమైన జెర్సీని సిద్ధం చేసింది. ‘లైన్స్ ఆఫ్ లెగసీ’ (Lines of Legacy) అనే థీమ్‌తో రూపొందించిన ఈ జెర్సీలో కేవలం రంగులు మాత్రమే కాదు, జట్టు యొక్క 18 ఏళ్ల అద్భుత ప్రస్థానం దాగి ఉంది. కేకేఆర్ జట్టును ఈ స్థాయికి చేర్చిన చారిత్రక ఘట్టాలను జెర్సీపై ప్రత్యేకమైన గీతల రూపంలో పొందుపరిచారు.

Read Also: IPL 2026: గాయం కారణంగా టోర్నీకి హర్షిత్ రాణా దూరం

మెకల్లమ్ విధ్వంసం నుండి రింకూ సింగ్ మ్యాజిక్ వరకు..

2008లో బ్రెండన్ మెకల్లమ్ ఆడిన 158 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ నుంచి, రింకూ సింగ్ చివరి ఓవర్లో కొట్టిన ఐదు సిక్సర్ల వరకు.. ఇలాంటి ఎన్నో ఐకానిక్ క్షణాలను గీతల రూపంలో జెర్సీపై పొందుపరిచారు. ఈ గీతలన్నీ కలిసి కేకేఆర్ (KKR) అక్షరాలను ఆవిష్కరించేలా వినూత్నంగా డిజైన్ చేశారు. “ఈ జ్ఞాపకాలను జెర్సీలో భాగం చేయడం ద్వారా అభిమానులు జట్టు కథలో ఒక భాగాన్ని ధరించే అవకాశం కల్పిస్తున్నాం” అని కేకేఆర్ ఒక ప్రకటనలో పేర్కొంది.

బీసీసీఐ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం కేకేఆర్ తన తొలి మ్యాచ్‌ను ఈ నెల‌ 29న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఏప్రిల్ 2న ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తొలి హోం మ్యాచ్‌లో తలపడుతుంది. ఇక, ఈసారి వేలంలో కామెరాన్ గ్రీన్, మతీశ పతిరణ‌, రోవ్‌మన్ పావెల్ వంటి కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసి కేకేఆర్ మరింత పటిష్ఠంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

📢 For Advertisement Booking: 98481 12870