हिन्दी | Epaper

Maoist leader Devji: లొంగిపోలేదు అరెస్టయ్యాం.. దేవజి

Saritha
Maoist leader Devji: లొంగిపోలేదు అరెస్టయ్యాం.. దేవజి

తప్పనిసరి పరిస్థితుల్లో అలా జరిగింది..

Maoist leader Devji: డిజిపి శివధర్ రెడ్డి ఎదుట ఇటీవలే లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత తిసిరి తిరుపతి అలియాస్ దేవ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవ్ తో పాటు బడే చొక్కారావు, నల్ల రాజిరెడ్డి, నరసింహారెడ్డి లొం గిపోగా తమది లొంగుబాటు కాదని తామంతా అరెస్టయ్యామని దేవి చెప్పడం పోలీసులను షాక్కు గురిచేసింది. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్లో వీరంతా లొంగిపోగా అదే సమయంలో వీరికి రివార్డులు కూడా అందించారు. లొంగిపోయిన సమయంలో తామంతా సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు చెప్పడం తెలిసిందే. రాజిరెడ్డి మాత్రం మావోయిజం ఎప్పటికీ అంతం కాదని, ప్రపంచం వున్నంత వరకు, సామాన్యుల సమస్యలు వున్నంతకాలం వుంటుందని వెల్లడించారు. అయితే శుక్రవారం నాడు దేవి తనను కలిసిన మీడియాతో మా ట్లాడుతూ మేమంతా లొంగిపోలేదు, అరెస్టు చేశారని తెలిపారు. అయితే ఈ అరెస్టంతా తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిందని ఆయన తెలిపారు.

Read Also: Mancherial Crime: పెంపుడు పిల్లులు కాదు పులులు.. వృద్ధురాలిని పీక్కుతిన్నాయి

Maoist leader Devji: లొంగిపోలేదు అరెస్టయ్యాం.. దేవజి
Maoist Leader Devji: We Did Not Surrender We Were Arrested.

మావోయిస్టు పార్టీ ప్రస్తుత స్థితిగతులు

మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి ఎక్కడ వున్నాడనేది తమకు తెలియదని ఆయన తెలిపారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ పూర్తిగా క్షీణించిందని, మారిన పరిస్థితుల్లో పోరాటం సాధ్యం కాదని దేవి పేర్కొన్నారు. 2023లో చివరిసారిగా సెంట్రల్ కమిటీ సమావేశం జరిగిందని, ఆ తరువాత పార్టీకి దిశా నిర్దేశం చేసేవారు లేకుండా పోయారని ఆయన తెలిపారు. మావోయిస్టు పార్టీ ఒక రాజకీయ పార్టీగా దేవజ్ తెలిపారు. రాజకీయ పార్టీ నడవాలంటే డబ్బులు కావాలని ఆయన వెల్లడించారు. పార్టీలో వున్న డబ్బులను కేవలం నగదు రూపంలోనే కాకుండా బంగారం కొనుగోలు చేస్తే బాగుంటుందని భావించి భారీగా బంగారాన్ని కొన్నామని ఆయన తెలిపారు.

ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ వద్ద కిలోల కొద్ది బంగారం వుం దని, కోట్లాది రూపాయల నగదు వుందని దుష్ప్రచారం జరిగిందని, ఇది సరైంది కాదని ఆయన తెలిపారు. తాను రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తు న్నానని చెబితే ఈ విషయంలోనూ అందరు అపార్థం చేసుకున్నారని దేవజ్ తెలిపారు. పార్లమెంటరీ వ్యవస్థలోని ఎంఎల్ఎ, ఎంపి, ఎంఎల్సి కావాలని తనకు లేదని, ప్రజల్లో వుండి వారి కోసం న్యాయపరంగా పోరాటం చేయడమే తన రాజకీయ జీవిత లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇక మావోయిస్టులో కొందరు జైల్లో వున్నారని వీరిని వెంటనే విడుదల చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘ప్రజాకేంద్రీకృత పాలనే మా విధానం’ – గవర్నర్ శివ ప్రతాప్‌ శుక్లా

‘ప్రజాకేంద్రీకృత పాలనే మా విధానం’ – గవర్నర్ శివ ప్రతాప్‌ శుక్లా

రూ.1.50 కోట్లు విలువ చేసే నగలు కొట్టేశాడు

రూ.1.50 కోట్లు విలువ చేసే నగలు కొట్టేశాడు

రంగనాథ్‌ను కోర్టుకు లాగుతా: కవిత

రంగనాథ్‌ను కోర్టుకు లాగుతా: కవిత

వివేకా హత్య కేసులో భారతిని విచారించాలి

వివేకా హత్య కేసులో భారతిని విచారించాలి

అంతర్జాతీయ క్రికెట్‌కు సర్ఫరాజ్ అహ్మద్ వీడ్కోలు

అంతర్జాతీయ క్రికెట్‌కు సర్ఫరాజ్ అహ్మద్ వీడ్కోలు

టెన్త్ విద్యార్థులకు నారా లోకేశ్ ఆల్ ది బెస్ట్

టెన్త్ విద్యార్థులకు నారా లోకేశ్ ఆల్ ది బెస్ట్

ఉత్తమ నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్ సరికొత్త చరిత్ర

ఉత్తమ నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్ సరికొత్త చరిత్ర

అనుమానంతో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

అనుమానంతో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

ట్రాన్స్ పోర్ట్ అధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

ట్రాన్స్ పోర్ట్ అధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

పాశుపతెశ్వర ఆలయ పునరుద్ధరణకు చర్యలు

పాశుపతెశ్వర ఆలయ పునరుద్ధరణకు చర్యలు

చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం ఆపై హత్య

చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం ఆపై హత్య

ప్రారంభమైన టెన్త్ పరీక్షలు.. విద్యార్థులకు వైఎస్ జగన్ ‘ఆల్ ది బెస్ట్’

ప్రారంభమైన టెన్త్ పరీక్షలు.. విద్యార్థులకు వైఎస్ జగన్ ‘ఆల్ ది బెస్ట్’

📢 For Advertisement Booking: 98481 12870