हिन्दी | Epaper

Telangana: గ్యాస్ సిలిండర్ల తరలింపు వాహనాలకు పోలీసు బందోబస్తు

Saritha
Telangana: గ్యాస్ సిలిండర్ల తరలింపు వాహనాలకు పోలీసు బందోబస్తు

Telangana: మధ్య ఆసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా దేశంలో 3 నెలకొన్న గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కంపెనీలతోపాటు గ్యాస్ సిలిండర్లు తర లించే వాహనాలకు పరిస్థితులను బట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. గ్యాస్ సంక్షోభం వల్ల దేశ వ్యాప్తంగా వాణిజ్య సిలిండర్లకు భారీగా కొరత ఏర్పడడం తెలిసిందే. దీనివల్ల అనేక రాష్ట్రాలలో హోటళ్లు మూతపడగా చాలాచోట్ల కట్టెల పొయ్యిలపై వంటలు సాగుతుండడం విదితమే. మరికొన్నిచోట్ల గ్యాస్ సిలిండర్ల చోరీలు జరగడంతో ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల తరలింపులో ఎక్కడా ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా వుండేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది.

Read Also: Telangana Rice Production: వరి ఉత్పత్తిలో తెలంగాణ టాప్

Telangana: గ్యాస్ సిలిండర్ల తరలింపు వాహనాలకు పోలీసు బందోబస్తు
Telangana: Police security for vehicles transporting gas cylinders

జిల్లాల పోలీసులకు కీలక ఆదేశాలు

రాష్ట్రంలో ఇప్పటి వరకు గృహావసరాలకు గ్యాస్ సరఫరాలో కొంతమేర ఇబ్బందులువున్నా తీవ్రమైన సంక్షోభం మాత్రం ఎదురవ్వలేదు. అయితే గ్యాస్ కంపెనీలపై ఒత్తిడి మాత్రం ఎక్కువయ్యింది. చాలాచోట్ల వినియోగదారులు ముందుజాగ్రత్త చర్యగా అదనపు సిలిండర్లను కొనుగోలు చేయడం వల్ల గ్యాస్ కంపెనీలపై ఒత్తిడి పెరిగింది. ఇది మరింత పెరగకుండా వుండేందుకు గ్యాస్ కంపెనీల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో పాటు గ్యాస్ కంపెనీలకు చమురు కంపెనీల నుంచి వచ్చే సిలిండర్ల లారీల వెంట బందోబస్తు కొనసాగించాల ని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. చమురు సంక్షోభం కొలిక్కి వచ్చేవరకు ఈ బందోబస్తు కొనసాగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

📢 For Advertisement Booking: 98481 12870