हिन्दी | Epaper

Uttar Pradesh: పకోడి తెచ్చేలోపు భార్య మాయం

Anusha
Uttar Pradesh: పకోడి తెచ్చేలోపు భార్య మాయం

Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లో అత్యంత విచిత్రమైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. గతేడాది డిసెంబర్ 1న వివాహం ఒక జంటకు ఊహించని కష్టం వచ్చి పడింది. హోలీ పండుగ కోసం పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి అత్తారింటికి తీసుకురావడానికి భర్త వెళ్లాడు. ఇద్దరూ కలిసి సంతోషంగా తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, ఈ ప్రయాణం వారి జీవితంలో ఒక పెద్ద మలుపు తిరుగుతుందని ఆ భర్త ఊహించలేదు.

Read Also: LPG Shortage: గ్యాస్ కష్టాలతో ఆగిపోయిన జొమాటో, స్విగ్గీ డెలివరీలు

మార్గమధ్యంలో ఒక బస్టాండ్‌లో బస్సు ఆగిన సమయంలో, సదరు భార్య తనకు చాలా ఆకలిగా ఉందని, ఒక ప్లేట్ పకోడి తీసుకురమ్మని భర్తను కోరింది. భార్య మీద ప్రేమతో అతను వెంటనే పకోడి తెచ్చేందుకు వెళ్ళాడు. పది నిమిషాల వ్యవధిలో అతను తిరిగి వచ్చేసరికి, అక్కడ సీటులో కూర్చున్న భార్య కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల ఎంత వెతికినా, అందరినీ వాకబు చేసినా ఆమె ఆచూకీ లభించలేదు.

అస‌లేం జ‌రిగిందంటే..!

ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు చెందిన ప్రీతమ్ సింగ్‌కు.. రాంపూర్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల రిమ్‌జిమ్‌తో గతేడాది డిసెంబర్ 1వ తేదీన వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి వీరు బాగానే కలిసున్నారు. అయితే హోలి పండుగ సందర్భంగా రిమ్‌జిమ్ తన పుట్టింటికి వెళ్లింది. పండుగ అయిపోవడంతో.. భార్యను ఇంటికి తీసుకురావాలని అత్తారింటికి వెళ్లాడు ప్రీతమ్ సింగ్. అక్కడే వారు చేసిన మర్యాదలన్నీ స్వీకరించి భార్యను తీసుకుని మార్చి 9వ తేదీన తన ఇంటికి బయలుదేరాడు.

Uttar Pradesh: Wife disappears before bringing pakodas
Uttar Pradesh: Wife disappears before bringing pakodas

మార్గమధ్యంలో మొరాదాబాద్‌లోని బిలారి బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో రిమ్‌జిమ్.. తనకు ఆకలిగా ఉందంటూ భర్త ప్రీతమ్ సింగ్‌కు చెప్పింది.బాగా ఆకలి వేస్తోందని.. తనకోసం ఒక ప్లేటు వేడివేడి పకోడీలు తీసుకురమ్మని కోరింది. దీంతో ప్రీతమ్ పక్కనే ఉన్న స్టాల్ వద్దకు వెళ్లి పకోడీలు ఆర్డర్ ఇచ్చాడు. పదే పది నిమిషాల్లో వేడి వేడి పకోడీలు తీసుకుని భార్య కూర్చున్న చోటుకు వచ్చాడు. కానీ అక్కడ కూర్చుని ఉండాల్సిన రిమ్‌జిమ్ కనిపించలేదు. మొదట ఆమె ఎక్కడికైనా వెళ్లిందేమో అని బస్టాండ్ అంతా వెతికాడు.

పోలీసులకు ఫిర్యాదు..

అక్కడి వారిని ఆరా తీసినా ఎవరూ ఆమెను చూడలేదని చెప్పారు. ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో ఆందోళన చెందిన ప్రీతమ్.. వెంటనే పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ కేసు ఫిర్యాదు చేశాడు.తన భార్య.. ఆమె పుట్టింటి గ్రామమైన ఓ యువకుడితో వెళ్లిపోయి ఉండొచ్చని భర్త ప్రీతమ్ పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బస్టాండ్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఆమె మొబైల్ ఫోన్ లొకేషన్‌ను కూడా ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. ఈ ఘటనపై ద‌ర్యాప్తు కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870