దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు నేడు ఒక శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) పథకంలో భాగంగా 22వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు అస్సాం పర్యటనలో భాగంగా విడుదల చేయనున్నారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా సుమారు 9.32 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 2,000 చొప్పున నేరుగా జమ కానున్నాయి. వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. డిజిటల్ చెల్లింపుల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ నగదు వెళ్తుండటంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకత పెరుగుతోంది.
Read Also : Allu Cinemas Launch: లారీల్లో వెళ్లి సినిమాలు చూసేవాళ్లం: సీఎం రేవంత్
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పండుగ కానుకగా రైతులకు భారీ ఊరటనిస్తోంది. పీఎం కిసాన్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ‘అన్నదాత సుఖీభవ’ నిధులను కలిపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా గన్నవరంలో విడుదల చేయనున్నారు. ఏపీలోని 46.85 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ. 6,000 (కేంద్రం ఇచ్చే రూ. 2,000 మరియు రాష్ట్రం అందించే రూ. 4,000) చొప్పున జమ కానున్నాయి. రైతులు తమ పేరు ఈ జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి annadathasukhibhava.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. పండుగ వేళ రైతన్నల చేతికి నగదు అందుతుండటంతో గ్రామాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :