हिन्दी | Epaper

Telangana: ఇప్పపువ్వు సారా పై అసెంబ్లీలో చర్చిస్తాం: మంత్రి జూపల్లి

Aanusha
Telangana: ఇప్పపువ్వు సారా పై అసెంబ్లీలో చర్చిస్తాం: మంత్రి జూపల్లి
  • ⁠ సారా పై ఇప్పుడు సమగ్రంగా మాట్లాడలేo
  • ⁠ మంత్రి జూపల్లి కృష్ణారావు

Read Also: Fairs: కాలుష్యరహితంగా జాతరలు జరగాలి

Telangana: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఇప్ప పువ్వు సారా పై చేసిన వాఖ్యలు, అభిప్రాయాల పై లోతుగా అధ్యయనం చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈ విషయం గా అసెంబ్లీ లో కూడా సమగ్రంగా చర్చిస్తామని వెల్లడించారు.ఇప్ప పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిదని, ఇప్పపువ్వు తో చేసే సారా తాగి గతంలో మన పూర్వీకులు వందేళ్లు బతికారని, బ్రిటిష్ పాలకులు వారి స్వార్థం తో నిషేధించిన ఇప్ప పువ్వు సారా ను మళ్లీ తీసుకురావాలని, దీనివల్ల అటు ప్రభుత్వానికి ఇటు గిరిజనులకు కూడా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇటీవల చేసిన వాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనానికి దారి తీసిన విషయం అందరికీ తెలిసిందే.

Telangana: We will discuss Ippapuvvu Sara in the Assembly: Minister Jupally
Telangana: We will discuss Ippapuvvu Sara in the Assembly: Minister Jupally

విశ్లేషణ

ఈ నేపథ్యంలో శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో నూతన పురపాలక సంఘం భవన ప్రారంభానికి విచ్చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు ను మీడియా ప్రతినిధులు అనిరుధ్ రెడ్డి ఇప్ప పువ్వు సారా పై చేసిన వాఖ్యల గురించి ప్రశ్నించగా ఆయన సానుకూలంగా స్పందించారు. అనిరుధ్ రెడ్డి ఇప్ప పువ్వు సారా పై తాను చేసిన పరిశోధన కు సంబంధించిన పత్రాన్ని కూడా తనకు ఇచ్చారని దానిని నిపుణులకు ఇచ్చి విశ్లేషణ చేయిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే అనిరుధ్ ఈ విషయం గా వెలిబుచ్చిన అభిప్రాయాల పై లోతుగా అధ్యయనం చేస్తామని చెప్పారు.

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సాంప్రదాయ మద్యం తయారీ పై వివరించారని, ఇప్ప పువ్వు సారా అధికారింగా విక్రయిస్తున్న రాష్ట్రాలు, ఇప్ప పువ్వు సారా ను కంట్రీ లిక్కర్ గా కాకుండా ఇండియన్ మేడ్ లిక్కర్ గా అనుమతించిన గోవా రాష్ట్రం గురించి కూడా తెలిపారని మంత్రి వివరించారు. అసెంబ్లీ లో కూడా ఇప్ప పువ్వు సారా పై సమగ్రంగా చర్చిస్తామని, అందరి అభిప్రాయాలు పరిగణ లోకి తీసుకొని ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు. అయితే ఈ దశ లో ఇప్ప పువ్వు సారా పై తాను ఇంత కంటే ఎక్కువ మాట్లాడడం భావ్యం కాదని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

📢 For Advertisement Booking: 98481 12870