Nellore Crime: ప్రమాదవశాత్తు లారీ ఢీకొనడంతో ఆటో మెకానిక్ మృతి చెందిన సంఘటన స్థానిక వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ వంతెన పై గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోవూరు మండలం చిన్న పడుగుపాడుకు చెందిన చాంద్ భాషా (40) తన అన్న ఖలీల్ తో కలిసి ఎనమడుగు సెంటర్ వద్ద ఆటో మెకానిక్ షాప్ నిర్వహిస్తున్నారు. గురువారం వెంకటేశ్వరపురం వంతెన పై ఆటో మరమ్మత్తులకు గురై నిలిచిపోయింది అనే సమాచారం రావడంతో ఇద్దరు కలిసి అక్కడికి వెళ్లారు. ఆటో రిపేర్ చేసిన అనంతరం తిరిగి తమ దుకాణం వద్దకు వెళుతుండగా కోవూరు వైపు వెళ్లే లారీ ఢీకొనడంతో చాంద్ భాషాకు తీవ్ర గాయాలైనాయి. వెంటనే అతన్ని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. నార్త్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Also: Nellore Crime: ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: