TVK Vijay: తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు కోలీవుడ్‌లో, తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. రాజకీయాల్లో బిజీ అవుతున్న తరుణంలోనే ఆయన కుటుంబంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
Read Also: Shabir Ahmad Shah Bail: నేత షబీర్ షాకు సుప్రీంకోర్టు బెయిల్!

తండ్రి పేరును తొలగించిన జాసన్ సంజయ్
దర్శకుడిగా తన అరంగేట్ర చిత్రం ‘సిగ్మా’ పనుల్లో బిజీగా ఉన్న జాసన్ సంజయ్ తన తండ్రి విజయ్ పేరును తన పేరు పక్కన నుంచి తొలగించాడు. తాజా సమాచారం ప్రకారం, తన పేరులో తన తండ్రి అక్షరం ‘V’ని తొలగించి ‘Jason Sanjay S’ గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ‘S’ అంటే తన తల్లి సంగీత పేరును సూచిస్తుంది. గతంలోనే సోషల్ మీడియాలో తండ్రిని అన్‌ఫాలో చేసిన జాసన్, ఇప్పుడు ఏకంగా తండ్రి పేరునే పక్కన పెట్టడం గమనార్హం.
మరోవైపు, విజయ్ భార్య సంగీత విడాకుల కోసం చెంగలపట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడం తమిళనాట కలకలం రేపింది. విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, అది తనను మానసిక వేదనకు గురిచేసిందని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయంలో పిల్లలు ఇద్దరూ (జాసన్ సంజయ్, దివ్య సాషా) తల్లికే మద్దతుగా నిలిచినట్లు సమాచారం. తనతో పాటు పిల్లల పోషణ కోసం భృతి చెల్లించాలని, అలాగే తమ నివాసం విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: