हिन्दी | Epaper

HYD Metro: మెట్రోలో ఫోన్‌పే మ్యాజిక్: ఇంటర్నెట్ లేకుండానే పేమెంట్స్

Anusha
HYD Metro: మెట్రోలో ఫోన్‌పే మ్యాజిక్: ఇంటర్నెట్ లేకుండానే పేమెంట్స్

HYD Metro: హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే వారికి డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం ఫోన్‌పే (PhonePe) తీపి కబురు అందించింది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (NCMC) ఫ్రేమ్‌వర్క్ కింద పనిచేసే ‘రూపే ఆన్-ది-గో’ కార్డును అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ప్రయాణికులు టికెట్ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండానే నేరుగా మెట్రో గేట్ల వద్ద ‘ట్యాప్’ చేసి ప్రయాణించవచ్చు.

Read Also: Karimnagar crime: దర్శనం పేరిట 18 లక్షలు తీసుకున్న పూజారి

ఆఫ్‌లైన్ పేమెంట్స్: ఇంటర్నెట్ లేకపోయినా నో ప్రాబ్లం!

ఎలా పొందాలి?

  • ప్రయాణికులు తొలి దశలో హైదరాబాద్‌లోని మెట్రో టికెట్ కౌంటర్ల వద్ద ఈ కార్డును కొనుగోలు చేయవచ్చు
  • మీ ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ధ్రువీకరించాలి
  • మెట్రో ఏజెంట్ ద్వారా కార్డు తీసుకుని యూపీఐ, నగదు లేదా ఇతర కార్డుల ద్వారా డబ్బులు జమ చేసుకోవచ్చు
HYD Metro: PhonePe Magic in Metro: Payments without internet
HYD Metro: PhonePe Magic in Metro: Payments without internet

ప్రత్యేకతలు ఇవే..
ప్రీపెయిడ్ విధానం: ఈ కార్డులోని చిప్‌లోనే డబ్బు నిల్వ ఉంటుంది. కాబట్టి ఇంటర్నెట్ అవసరం లేకుండానే ‘ట్యాప్-అండ్-పే’ పద్ధతిలో టికెట్ ఛార్జీలు చెల్లించవచ్చు.
లావాదేవీల పరిమితి: కార్డులో గరిష్ఠంగా రూ.2,000 వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా ఒకేసారి గరిష్ఠంగా రూ.500 వరకు లావాదేవీలు జరపవచ్చు.

ఒక్క కార్డు.. ఎన్నో ఉపయోగాలు: ఇది కేవలం హైదరాబాద్ మెట్రోకే పరిమితం కాదు. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లోని మెట్రోలు, బస్సులు, రైళ్లు, టోల్ ప్లాజాలు, పార్కింగ్ కేంద్రాల్లో కూడా ఈ కార్డును వాడుకోవచ్చు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని రవాణా సంస్థలతో అనుసంధానం చేసి, ఈ సేవలను మరింత విస్తరిస్తామని ఫోన్‌పే పేమెంట్స్ హెడ్ దీప్ అగర్వాల్ వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అబ్రహాం లింకన్ యుద్ధనౌకపై దాడి! ఇరాన్ వాదనలను కొట్టిపారేసిన అమెరికా

అబ్రహాం లింకన్ యుద్ధనౌకపై దాడి! ఇరాన్ వాదనలను కొట్టిపారేసిన అమెరికా

మంత్రి ఊరిలోనే కలకలం.. గురుకులంలో 40 మందికి ఫుడ్ పాయిజన్!

మంత్రి ఊరిలోనే కలకలం.. గురుకులంలో 40 మందికి ఫుడ్ పాయిజన్!

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్‌

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్‌

రూ.320 దాటిన పెట్రోల్.. ఆర్థిక సంక్షోభం తీవ్రం!

రూ.320 దాటిన పెట్రోల్.. ఆర్థిక సంక్షోభం తీవ్రం!

రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి క్రేజీ అప్‌డేట్

రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి క్రేజీ అప్‌డేట్

బాలికపై లైంగిక దాడి.. వీడియోలతో బ్లాక్‌మెయిల్

బాలికపై లైంగిక దాడి.. వీడియోలతో బ్లాక్‌మెయిల్

అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!

అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!

ముగ్గురు విద్యార్థినులపై క్లాస్ మెట్ అఘాయిత్యం

ముగ్గురు విద్యార్థినులపై క్లాస్ మెట్ అఘాయిత్యం

మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్‌సైట్

మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్‌సైట్

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో ఊరట

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో ఊరట

ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉచిత రవాణా: సీఎం రేవంత్

ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉచిత రవాణా: సీఎం రేవంత్

పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీ ఆవిష్కరణ

పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీ ఆవిష్కరణ

📢 For Advertisement Booking: 98481 12870