हिन्दी | Epaper

Farooq Abdullah: దేవుడే నన్ను రక్షించాడు: ఫరూక్ అబ్దుల్లా

Anusha
Farooq Abdullah: దేవుడే నన్ను రక్షించాడు: ఫరూక్ అబ్దుల్లా

Farooq Abdullah: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాపై జమ్మూ శివార్లలో హత్యాయత్నం జరిగింది. ఒక వివాహ వేడుకలో పాల్గొన్న ఆయనపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే భద్రతా సిబ్బంది, అక్కడి ప్రజలు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.

Read Also: Iran Allows Indian ships: హర్ముజ్ జలసంధిలో భారత్‌ ట్యాంకర్లకు లైన్ క్లియర్!

ఆ భయంకర క్షణాలను వివరించిన అబ్దుల్లా

“నేను క్షేమంగా ఉన్నాను, ఆ దేవుడే నన్ను కాపాడాడు” అని అబ్దుల్లా పేర్కొన్నారు. ఆ భయంకరమైన క్షణాలను గుర్తుచేసుకుంటూ.. “దాడి చేసిన వ్యక్తి నా మెడ వెనుక భాగం వరకు చేరుకోగలిగాడు. చివరి నిమిషంలో ఎన్‌ఎస్‌జీ (NSG) సహా సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకుని లొంగదీసుకున్నారు. వెంటనే నన్ను కారులోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు” అని ఆయన వెల్లడించారు.

భద్రతా వైఫల్యంపై సీఎం ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం..

ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. తన తండ్రికి జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ.. లోడ్ చేసిన తుపాకీతో ఒక వ్యక్తి అంత దగ్గరకు ఎలా రాగలిగాడు అని ఆయన ప్రశ్నించారు. ఇది స్పష్టమైన భద్రతా వైఫల్యమని ఆయన మండిపడ్డారు. డిప్యూటీ సీఎం సురీందర్ ఛౌదరి కూడా హోటల్ వద్ద భద్రతా ఏర్పాట్లు సరిగా లేవని ఆరోపించారు. మరోవైపు నిందితుడి నేపథ్యంపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. జమ్మూలో దుకాణాలు నడుపుకునే కమల్ సింగ్‌కు.. ఫరూక్ అబ్దుల్లాపై అంతటి పగ ఎందుకు పెరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ ఫిక్స్

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ ఫిక్స్

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

పాకిస్థాన్ లీగ్‌ను కాదన్న ముజరబానీపై పీసీబీ ఫైర్?

పాకిస్థాన్ లీగ్‌ను కాదన్న ముజరబానీపై పీసీబీ ఫైర్?

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

📢 For Advertisement Booking: 98481 12870