Trump trade : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో స్వదేశీ పరిశ్రమలను రక్షించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విదేశీ వస్తువుల వల్ల అమెరికా పరిశ్రమలు నష్టపోతున్నాయనే అభిప్రాయంతో ట్రంప్ ప్రభుత్వం కొత్త వాణిజ్య దర్యాప్తును ప్రారంభించింది.
1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద ఈ విచారణను ప్రారంభించారు. ఈ చర్య ప్రపంచ వాణిజ్య మార్కెట్లలో చర్చనీయాంశంగా మారింది.
16 దేశాలు టార్గెట్
ఈ దర్యాప్తు కేవలం ఒక్క దేశంపైనే కాకుండా అనేక దేశాలపై దృష్టి పెట్టింది. భారత్, చైనా, యూరోపియన్ యూనియన్, మెక్సికో, జపాన్, దక్షిణ కొరియా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.
అలాగే వియత్నాం, థాయిలాండ్, బంగ్లాదేశ్ వంటి ఆగ్నేయాసియా దేశాలపై కూడా అమెరికా దృష్టి సారించింది.
అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ ప్రకారం.. కొన్ని దేశాలు తమ అవసరాల కంటే ఎక్కువగా ఉత్పత్తి చేసి, మిగులు వస్తువులను తక్కువ ధరలకు అమెరికా మార్కెట్‌లో విక్రయిస్తున్నాయని ఆరోపించారు.
భారత్‌పై ప్రభావం ఉంటుందా?
భారత్ కూడా ఈ జాబితాలో ఉండటం వల్ల భవిష్యత్తులో వాణిజ్య సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇటీవల భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించేందుకు అంగీకరించడంతో అమెరికా భారత ఉత్పత్తులపై విధించిన సుంకాన్ని 50% నుంచి 18%కి తగ్గించింది.
అయితే తాజా సెక్షన్ 301 దర్యాప్తు కారణంగా ఈ ట్రేడ్ ఒప్పందం భవిష్యత్తులో మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read also: Loksabha: లావు వ్యాఖ్యలతో లోక్ సభలో తీవ్ర దుమారం

ట్రంప్ లక్ష్యం ఇదే
“అమెరికా కార్మికులకు ఉద్యోగాలు రావాలి” అనేది ట్రంప్ ప్రధాన నినాదం. విదేశీ వస్తువులపై పన్నులు పెంచడం ద్వారా అమెరికాలోనే ఉత్పత్తి పెరిగి, దేశీయ పరిశ్రమలు బలోపేతం అవుతాయని ఆయన భావిస్తున్నారు.
ఈ నిర్ణయం ప్రపంచ వాణిజ్య సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: